నవంబర్ 29న జరుగు ఇంటర్వ్యూలకు ఆసక్తి గల వారు హాజరుకావాలి
- జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి ప్రతినిధి , నవంబర్ 27
జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో ప్రైవెటు ఉద్యోగాల కొరకు ఆసక్తి గల వారు నవంబర్ 29న నిర్వహించు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిఆర్డిఎ-ఈజిఎంఎం, ఆధ్వర్యంలో కార్వీ, హైదరాబాద్ లో పనిచేయుటకు 50 మంది సిబ్బంది అవసరమని తెలిపారు. కావున ఈ క్రింద తెలిపిన అర్హతల ప్రకారం ఆసక్తి గల నిరుద్యోగ యువతి యువకులు , సదరు ఆసక్తి గల అభ్యర్థులు (19-29 సంవత్సరాల లోపు వయస్సు గల వారు) సంబంధిత ఒరిజినల్ సర్టిపికేట్లతో నవంబర్ 29,2019న ఇ.జి.ఎం.ఎం., ట్రైనింగ్ సెంటర్ ప్రగతినగర్ , పెద్దపల్లి నందు ఇంటర్వ్యూకు హజరు కావాలని, మరిని వివరాలకు 9705292427 నంబర్ నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కోన్నారు.