ఆసుపత్రిలో వైకాపా నేతలను పరామర్శించిన ఎమ్మెల్యే కాకాణి
నెల్లూరు
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టిడిపి కార్యకర్తల దాడి వల్ల చికిత్స పొందుతున్న ముత్తుకూరు మండలం ఈదూరు వెంకన్న పాళెం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులను వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసన సభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. వైకాపా నేతల పై టిడిపి నాయకుల దాడిని అయన ఖండించారు. బాధితులకు అవసరమైన వైద్యం అందించాలసిందిగా వైద్యులను కోరారు. కాకాణి.మాట్లాడుతూ ఓటమిని జీర్ణించుకోలేక వైయస్సార్సీపీ నాయకులపై టిడిపి నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో ఉన్న వ్యక్తులు తగడాలకు బీజం వేశారు. వాటివల్ల నేటికి కక్ష్యపూరిత దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. బాధితులను చూస్తే హృదయ విచారకరమైన పరిస్థితి. ఇది హేయమైన చర్య, ఇటువంటి వాటిని మేము ఖండిస్తున్నామని అన్నారు. మేము అధికారాన్ని అడ్డుపెట్టుకుని, లేదా మాపై దాడి చేశారనే నెపంతో ఎదురుదాడులు చేయాలనే ఆలోచన లేదు. గ్రామాలలో శాంతియుత వాతావరణం ఉండాలని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో ముందుకు పోతున్నాం. అందరినీ సమన్వయ పరుచుకొని ఒక సమగ్రమైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలని అన్నారు. చట్టానికి ఎవరు అతీతులుకారు, చట్టం తన పని చేసుకొని పోతుంది. గ్రామాలలో ప్రభుత్వ భూములను అందరికీ ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని కాకాణి అన్నారు.