YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

52 రోజుల  సమ్మెలో 35  బస్సు ప్రమాదాలు

52 రోజుల  సమ్మెలో 35  బస్సు ప్రమాదాలు

52 రోజుల  సమ్మెలో 35  బస్సు ప్రమాదాలు
హైద్రాబాద్,
రద్దీగా ఉండే సిటీ రోడ్లమీద లారీలు, టిప్పర్లు నడిపినట్టు ఆర్టీసీ బస్సులు నడిపే తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే యాక్సిడెంట్లు పెరుగుతున్నయ్. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా గ్రేటర్ ఆర్టీసీ ఎవరిని పడితే వాళ్లను రిక్రూట్ చేసుకుంది. 52 రోజుల సమ్మె కాలంలో అనుభవం లేని డ్రైవర్లతో ప్రమాదాలు పెరగడంతో హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తాత్కాలిక డ్రైవర్ల కారణంగానే ప్రమాదాలు పెరిగాయని.. ఇది ప్రజల ప్రాణాలకు ప్రమాదమేనని తెలిపింది. మంగళవారం బర్కత్ పురాకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డు 12లో స్కూటీని గుద్దింది. ఈ ఘటనలో సోహిని సక్సేనా అక్కడికక్కడే చనిపోయింది. ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన నాటి నుంచి గ్రేటర్‌లో దాదాపు చిన్న, పెద్ద ప్రమాదాలు 35కి పైగా జరిగినట్టు సమాచారం.ప్రజా రవాణాలో డ్రైవర్‌గా చేరటమనేది అంత సులభం కాదు. ఏపీ ట్రాన్స్ పోర్ట్, మోటార్ వెహికిల్ యాక్ట్, సెంట్రల్ మోటార్ వెహికిల్ యాక్ట్ -1988 ప్రకారం ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌గా చేరాలంటే కొన్ని నిబంధనలున్నాయి . హెవీ డ్రైవింగ్ లెసెన్స్ విత్ బ్యాడ్జ్ తో పాటు 8క్లాస్ పాసై ఉన్నవారిని డ్రైవర్లుగా తీసుకుంటారు. పేపర్ యాడ్ ద్వారా గానీ ఎంప్లాయిమెంట్ ఆఫీసులో నమోదు చేసుకున్న వారికి సమాచారం ఇస్తూ ఈ ప్రక్రియ చేపడుతారు. లైసెన్స్, క్వాలిఫికేషన్‌ని వెరిఫై చేసి, అంతా ఓకే అనుకున్నప్పుడు మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ లో ప్రతి ఒక్కరికీ మెడికల్ టెస్ట్ చేసి, ఫిజికల్ ఫిట్‌గా ఉన్నవారిని మాత్రమే ఆర్ఎంలకు రిఫర్ చేస్తారు . హెవీ డ్రైవింగ్ లెసెన్స్ ఉండి డ్రైవింగ్‌లో అనుభవమున్నా సరే ప్రతి ఒక్కరికీ హకీం పేట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ ఉంటుంది. రోజు 8 గంటల పాటు మూడు నుంచి 4 నెలలు సిటీలోని రద్దీ ఉండే ప్రాంతాలు ఇతర రోడ్లపై డ్రైవింగ్ శిక్షణ ఇస్తారు. తర్వాత థియారీ క్లాస్‌లలో రోడ్డు భద్రతకు సంబంధించి అవగాహన ఉంటుంది. ట్రైనింగ్ సెంటర్ వారు ఆర్ఎంలకు ఇచ్చే నివేదికను బట్టి డ్రైవర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.కండక్టర్‌ని తీసుకోవటానికి కూడా శిక్షణ అనేది తప్పనిసరి. ముందుగా ఆర్టీవో నుంచి కండక్టర్ లెసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత జాన్సన్ అంబులెన్స్ సెంటర్ నుంచి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ తీసుకోవాలి. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలన్నది కండక్టర్లకు తెలిసి ఉండాలి. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌లో మెడికల్ టెస్టుల తర్వాత ఆర్టీవో ఓరల్‌గా ఎగ్జామిన్ చేసి జాబ్ ఇస్తారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఈ చట్టానికి తూట్లు పొడించింది. ఎలాంటి నిబంధనలను అనుసరించకుండా వందలాది మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించింది. హెవీ డ్రైవింగ్ లెసెన్స్ ఉన్నవారిని డ్రైవర్‌గా నియమించారు. టెన్త్ పాస్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లను కండక్టర్లుగా తీసుకున్నారు. మోటార్ వెహికిల్ ఇన్‌స్పె క్టర్లు, ఆర్టీఓలే డ్రైవర్లను సెలెక్ట్ చేశారు. వాస్తవానికి వీరికి ఆ అధికారం లేదు. ప్రభుత్వం చేపట్టిన నియమాకలన్నీ నిబంధనల ఉల్లం ఘనలే. నేర చరిత్ర ఉన్నవాళ్లు, ప్రమాదాలకు పాల్పడినవారిని కూడా డ్రైవర్లుగా నియమించారన్న ఆరోపణలున్నాయి . గ్రేటర్ పరిధిలో అవసరమైనంత మంది డ్రైవర్లు పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవటంతో కొందరిని బలవంతంగా రిక్రూట్ చేసినట్టు సమాచారం. ఆర్టీసీ డ్రైవర్లు ప్రమాదాలకు పాల్పడితే శాఖాపరంగా కఠినమైన శిక్షలు ఉంటాయని.. కండక్టర్లకు అదే పరిస్థితిఉంటుందని ఆర్టీసీ రెగ్యులర్ కార్మికులు చెబుతున్నారు. బస్సు డ్యామేజ్ అయితే డ్రైవర్ జీతం నుంచి కట్ చేస్తారని.. ప్రమాదాలకు నష్టపరిహారాన్ని డ్రైవర్ల నుంచే వసూలు చేస్తారని చెబుతున్నారు. కానీ, తాత్కాలిక డ్రైవర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలకు బాధ్యత ఎవరిదన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.మంగళవారం బస్సు ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్ అడ్డాకుల శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికడ్రైవర్ పై చర్యలు తీసుకోవటానికి ఏముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయటంగానీ, రికవరీ చేయటం గానీ సాధ్యం కాదు. తాత్కాలిక డ్రైవర్లంటేనే బాధ్యత లేకుండా ఉంటుందన్న ఆరోపణలువెల్లు వెత్తుతున్నాయి.

Related Posts