YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

డ్వాక్రా యనిట్లకు జియో ట్యాగింగ్

డ్వాక్రా యనిట్లకు జియో ట్యాగింగ్

డ్వాక్రా యనిట్లకు జియో ట్యాగింగ్
వరంగల్, 
డ్వాక్రా మహిళలు గతంలోలాగా అవసరం లేకున్నా లోన్‌తీసుకోవడం ఇకపై కుదరదు.  ఏ అవసరం కోసం లోన్‌తీసుకుంటున్నామో ముందే చెప్పడంతోపాటు లోన్‌ ఎత్తుకున్న 10 రోజుల్లో యూనిట్లు ఏర్పాటు చేయాలి. మహిళల స్వయం ఉపాధి కోసం ఏటా సుమారు ఆరేడు వేల కోట్ల రూపాయల అప్పులు ఇస్తున్నా.. వాటిని కుటుంబ అవసరాలకో, ఇతర నాన్‌ప్రొడక్టివ్‌కార్యకలాపాలకే ఖర్చు చేస్తున్నారని, ఎలాంటి స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పడం లేదని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే రుణాల మంజూరు, వినియోగం, తిరిగి చెల్లింపులపై కొత్త పద్దతి తీసుకొచ్చారు.లోన్‌కోసం సీసీ వద్ద ఉన్న ట్యాబ్‌ద్వారానే అప్లై చేయాలి. ఆ లోన్‌తో ఏ యూనిట్‌(బిజినెస్‌) పెడుతున్నామో పేర్కొనాలి. ప్రొడక్టివ్‌యూనిట్లుగా పాడి గేదెలు, కిరాణం, టైలరింగ్‌, మగ్గం వర్క్‌, పచ్చళ్ల తయారీ, కంగన్‌హాల్‌, బ్యూటీ పార్లర్‌తదితర 125 రకాల యూనిట్ల పేర్లు అందులో కనిపించేలా అప్లికేషన్‌రూపొందించారు. ఇవి కాకుండా పెళ్లి ఖర్చు, చదువులు, అప్పులు తీర్చడం, వైద్య ఖర్చులు, ఇంటి నిర్మాణం తదితర నాన్‌ప్రొడక్టివ్‌ఆప్షన్లూ ఉన్నాయి. ఇతర అవసరమైతే అదర్స్‌లో వివరాలివ్వాలి. గ్రూప్‌లోని 10 మంది కలిసి పది లక్షల లోన్‌తీసుకుంటే 8 మంది యూనిట్ల ఏర్పాటుకు, మిగతా ఇద్దరు సభ్యులు పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణం తదితర నాన్‌ప్రొడక్టివ్‌అవసరాలకు ఖర్చు చేసుకోవచ్చు.రుణంతో ఏర్పాటు చేసిన యూనిట్లను సీసీలు జియో ట్యాగింగ్‌చేస్తారు. యూనిట్‌లైవ్‌ఫొటో అప్‌లోడ్‌చేయాలి. సభ్యురాలు తీసుకున్న లోన్‌కు సమానమైన ఆస్తులను పది రోజుల్లో కొనాలి. పాడి పశువులను, మేకలు, గొర్రెలను కొనుగోలు చేస్తే వాటికి ఇన్సూరెన్స్‌చేయించి ట్యాగ్‌నంబర్‌ను బ్యాంకు లింకేజీ లాగిన్‌లో ఎంట్రీ చేయించాలి.రాష్ట్రంలో 4.5 లక్షల డ్వాక్రా సంఘాల్లో 46 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సంఘం సీనియార్టీని బట్టి రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి.ఈ ఏడాది రూ.6,504 కోట్ల రుణ లక్ష్యాన్ని పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.330 కోట్ల టార్గెట్‌ను బ్యాంకర్లు పూర్తి చేశారు.గతంలో గ్రూప్‌మొత్తానికి కలిపి లోన్‌వచ్చేది. పది మంది సభ్యుల్లో డబ్బులు అవసరం లేని వారు కూడా తీసుకుని కిస్తీ చెల్లించేవారుఇక మీదట డబ్బులు అవసరమైన సభ్యులే లోన్‌తీసుకోవచ్చు. నెలనెలా సక్రమంగా కిస్తీ కడితే మిగతా సభ్యులకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు లోన్‌తీసుకునే అవకాశం ఉంటుంది.మంజూరైన లోన్‌మొత్తం నేరుగా సభ్యురాలి ఖాతాలోకి బ్యాంకు అధికారులు ట్రాన్స్‌ఫర్‌చేస్తారు. కిస్తీ డబ్బులు కూడా ఎవరికి వారే చెల్లించొచ్చు. కిస్తీ చెల్లించగానే పేమెంట్‌జరిగినట్లు స్టేట్‌మెంట్‌తీసుకునేందుకు సభ్యుల కోసం సెర్ప్‌అధికారులు ప్రత్యేక కార్డును రూపొందించి పంపిణీ చేస్తున్నారు.

Related Posts