YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి దేశీయం

మనుషుల అక్రమత‌ర‌లించ‌డానికి అడ్డుకట్ట భారతదేశానికి, మ‌య‌న్మార్ కు మ‌ధ్య ఎంఒయు

మనుషుల అక్రమత‌ర‌లించ‌డానికి అడ్డుకట్ట భారతదేశానికి, మ‌య‌న్మార్ కు మ‌ధ్య ఎంఒయు

మనుషుల అక్రమత‌ర‌లించ‌డానికి అడ్డుకట్ట భారతదేశానికి, మ‌య‌న్మార్ కు మ‌ధ్య ఎంఒయు
న్యూ డిల్లీ 
మనుషుల ను దొంగ‌చాటు గా త‌ర‌లించ‌డాన్ని అడ్డుకోవడం లో ద్వైపాక్షిక స‌హ‌కారాని కి సంబంధించి భారతదేశానికి, మ‌య‌న్మార్ కు మ‌ధ్య సంత‌కాలైన ఎంఒయు కు మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది.మనుషుల ను దొంగ‌చాటు గా త‌ర‌లించ‌డాన్ని అడ్డగించడం, బాధితుల ను విడిపించడం మరియు వారి ని వారి స్వ‌దేశాని కి పంపించే కార్యకలాపాల లో ద్వైపాక్షిక స‌హ‌కారం అంశం పై భారతదేశాని కి మరియు మ‌య‌న్మార్ కు మ‌ధ్య ఒక అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద పత్రాని (ఎంఒయు)కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  
ఈ ఎంఒయు ల‌క్ష్యాల లో:
•ఉభయ దేశాల మ‌ధ్య స్నేహ బంధాన్ని బ‌లోపేతం చేయ‌డం తో పాటు, మనుషుల అక్‌ మ దొంగ‌చాటు గా త‌ర‌లించ‌డాన్ని అడ్డగించడం, బాధితుల ను విడిపించడం మరియు వారి ని వారి స్వ‌దేశాని కి పంపించే కార్యకలాపాల లో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని పెంపొందించుకోవ‌డం;
.మాన‌వుల దొంగ‌చాటు త‌ర‌లింపు ను దాని అన్ని రూపాల లోను అడ్డుకోవ‌డం కోసం సహకారాన్ని పెంపొందించుకోవడం మ‌రియు అటువంటి కార్య‌క‌లాపాల బారిన‌ ప‌డిన వారిని కాపాడటం, ఇంకా వారి కి అవ‌స‌ర‌మైనటువంటి స‌హాయాన్ని అందించ‌డం;
•రెండు దేశాలలోను మనుషుల అక్రమ తరలింపు నకు పాల్పడే వారు మరియు వ్య‌వ‌స్థీకృత నేర ముఠాల కు విరుద్ధం గా ద‌ర్యాప్తు ను మ‌రియు విచార‌ణ‌ ను వేగ‌వంతం గా జ‌రిగేటట్టు చూడ‌టం.
•వ్య‌క్తుల ను అక్ర‌మం గా త‌ర‌లించ‌డాన్ని నిరోధించ‌డం కోసం సంబంధిత సంస్థ‌ల తో మ‌రియు మంత్రిత్వ శాఖ‌ల తో క‌ల‌సి వ్యూహాల ను అమ‌లు చేయ‌డం తో పాటు వ‌ల‌స‌, ఇంకా స‌రిహ‌ద్దు ప్రాంతాల లో తీసుకొనే నియంత్ర‌ణ చ‌ర్య‌ల కు సంబంధించిన స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయ‌డం.
•మాన‌వుల అక్ర‌మ త‌ర‌లింపు ను అడ్డ‌గించేందుకు కృషి చేయడం లో భాగం గా కార్య సమూహాల ను, టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయ‌డం.
•మ‌నుషుల ను అడ్డ‌దారిన త‌ర‌లించే వారి మ‌రియు ఆ విధం గా త‌ర‌లింపున‌ కు లోనైన వారి యొక్క గణాంకాల ను సిద్ధం చేసి, భారతదేశం మరియు మయన్మార్ లలోని నిర్దుష్ట కేంద్ర బిందువుల ద్వారా భ‌ద్ర‌మైనటువంటి మ‌రియు గోప్య‌మైనటువంటి ప‌ద్ధ‌తుల లో ఆదాన ప్ర‌దానాలు చేసుకోవ‌డం.
•ఉభ‌య దేశాల లో సంబంధిత ఏజెన్సీల కోసం సామ‌ర్ధ్య నిర్మాణ కార్య‌క్ర‌మాల ను నిర్వహించడం.
•అక్ర‌మ త‌ర‌లింపున‌ కు గురి అయిన బాధితుల‌ ను ర‌క్షించ‌డం, వారి ని విడిపించడం, వారి ని ఏకీకృత పరచి, స్వ‌దేశాని కి పంపించ‌డం కోసం ఉద్దేశించిన‌టువంటి ప్రామాణిక సంచాలన ప్రక్రియ ను ఖరారు చేసి ఆ ప్రక్రియ ను అమలులోకి తీసుకు రావడం.. భాగాలు గా ఉంటాయి.
పూర్వ‌రంగం:
వ్యక్తుల ను అక్ర‌మం గా స‌రిహ‌ద్దులు దాటించ‌డం జాతీయ స్థాయి లో, అంత‌ర్జాతీయ స్థాయి లో జటిల సమస్య అయిపోయింది.  ఇది ఒక సంక్లిష్ట‌ స్వ‌భావాన్ని క‌లిగివుండటం తో దేశీయ, ప్రాంతీయ మ‌రియు అంత‌ర్జాతీయ స్థాయిల లో దీనిని ఎదుర్కొనేందుకు ఒక బ‌హుళ పార్శ్విక వ్యూహాన్ని అమ‌లు చేయ‌వలసినటువంటి అవసరం ఏర్‌్డింది.  వ్య‌క్తుల ను అడ్డ‌దారి న దేశాల ఎల్ల‌ల‌ ను త‌ర‌లించే కార్య‌క‌లాపాల ను అరికట్టాలంటే అంత‌ర్జాతీయ స‌హ‌కారం, స‌మ‌న్వ‌యం అత్య‌వ‌స‌రం అయిపోయాయి. భారతదేశం మరియు మయన్మార్ ల స‌రిహ‌ద్దు ప్రాంత నియంత్ర‌ణ ఏజెన్సీ లు మరియు కమ్యూనికేశన్ తాలూకు విభిన్న సంస్థల మధ్య స‌హ‌కారాన్ని ప‌టిష్ట ప‌ర‌చ‌డం అనేవి వ్య‌క్తుల త‌ర‌లింపు నిరోధం లో ప్రాంతీయ సమన్వయాన్ని ప్రోత్సహించగల ప్రభావశీల ఉప‌క‌ర‌ణాలు కాగ‌లుగుతాయి.  

Related Posts