రెండు సార్లు పన్ను విధింపు నివారణకు మంత్రివర్గం ఆమోదం
న్యూ డిల్లీ 28
పన్నుల ను రెండు సార్లు విధించడాన్ని నివారించేందుకు గాను చిలీ కి మరియు భారతదేశాని కి మధ్య ఒడంబడికల ప్రాథమిక పత్రాని కి, ఇంకా ఒప్పందాని కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పన్నుల ను రెండు సార్లు విధించడాన్ని నివారించడం కోసం, ఆదాయం పై పన్నుల కు సంబంధించి ఎగవేతలు, పన్నుల బారి నుండి తప్పించుకోవడాన్ని ఆపడం కోసం చిలీ, భారతదేశాని కి మధ్య పన్ను లను రెండు మార్లు విధించడాన్ని నివారించేందుకు ఉద్దేశించినటువంటి ఒప్పందం (డిటిఎఎ)తో పాటు ప్రోటోకాల్ పత్రాల పైన సంతకాల కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.పన్నుల ను రెండు సార్లు విధించడాన్ని నివారించేందుకు ఈ డిటిఎఎ మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య పన్నులు వసూలు చేసే హక్కు ల స్పష్టమైన విభజన ద్వారా ఇన్వెస్టర్ లకు పన్ను సంబంధిత నిశ్చితి ప్రాప్తించనుంది. అంతేకాక మూల దేశం లో వడ్డీ, రాయల్టీ లు మరియు సాంకేతిక సేవ ల తాలూకు రుసుము నిర్ధారణ కావడం ద్వారా పెట్టుబడి ప్రవాహాలు అధికం అవుతాయి. జి-20 ఒఇసిడి బేస్ ఇరోఝన్ ప్రాఫిట్ శిఫ్టింగ్ (బిఇపిఎస్) పథకం యొక్క కనీస ప్రమాణాల ను, ఇతర సిఫారసుల ను ఈ ఒప్పందం అమలు పరుస్తుంది. ఒప్పందం లో భూమిక పాఠాన్ని, ఒక ప్రిన్సిపల్ పర్పస్ టెస్టు ను, ఒక సాధారణ దుర్వినియోగ వ్యతిరేక నిబంధనల ను చేర్చడం తో పాటు బిఇపిఎస్ పథకం లో భాగం గా లాభాల ను పరిమితం చేసేందుకు సంబంధించిన ఒక సరళతరమైనటువంటి షరతు ను సైతం చేర్చి నందువల్ల పన్ను ల నియమావళి లోని అంతరాల ను మరియు అసమతూకాల ను అడ్డం పెట్టుకొని ప్రయోజనాన్ని పొందాలనుకొనే ప్రణాళిక తో పన్ను ల వ్యూహాన్ని రచించడాన్ని అరికట్టడం కూడా సాధ్యపడనుంది.మంత్రివర్గం ఆమోదం లభించిన అనంతరం ప్రస్తావిత ఒప్పందాన్ని అమలు లోకి తీసుకు వచ్చేందుకు అవసరమైన లాంఛనాల ను పూర్తి చేయడం జరుగుతుంది. ఈ ఒప్పందం అమలు తీరు ను మంత్రిత్వ శాఖ గమనిస్తూ నివేదిక ను ఇస్తుంది.