మత్తు మందులు, సైకోట్రాపిక్ సబ్ స్టన్సెస్ పై సౌదీ అరేబియాతో ఎంఒయు
న్యూ ఢిల్లీ
మత్తు మందులు, సైకోట్రాపిక్ సబ్ స్టన్సెస్, ఇంకా కెమికల్ ప్రికర్సర్స్ యొక్క అక్రమ రవాణా పైన మరియు దొంగచాటు చేరవేత పైన పోరాటం సలిపే రంగం లో భారతదేశాని కి, సౌదీ అరేబియా కు మధ్య సంతకాలైన ఎంఒయు లకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.మత్తు మందులు, సైకోట్రాపిక్ సబ్ స్టన్సెస్, ఇంకా కెమికల్ ప్రికర్సర్స్ యొక్క అక్రమ రవాణా మరియు నిషిద్ధ చేరవేత లపై పోరాటం సలిపే రంగం లో సౌదీ అరేబియా కు, భారతదేశాని కి మధ్య సంతకాలైన అవగాహన పూర్వక ఒప్పందాల (ఎంఒయు స్)కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
దీనివల్ల లాభాలు:
ఈ ఎంఒయు ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ ఔషధ నియంత్రణ ఒప్పందాల లో నిర్వచించిన ప్రకారం మత్తు మందులు, సైకోట్రాపిక్ సబ్ స్టన్సెస్ మరియు కెమికల్ ప్రికర్సర్స్ ను అక్రమం గా రవాణా చేయడం పై పోరాటం సలపడం లో ఇరు దేశాల మధ్య సహకారాని కి మార్గాన్ని సుగమం చేయడం తో పాటు అటువంటి సహకారాన్ని పెంపొందింప చేయడాని కి కూడాను ఉద్దేశించింది.ఈ ఎంఒయు లో భాగం గా సంబంధిత సమాచారాన్ని ఆదానం- ప్రదానం చేసుకొనేందుకు ఒక వెసులుబాటు ఉంది. అంతేకాదు, మత్తు మందులు, ఎన్‌డిపిఎస్ ఎండ్ కెమికల్ ప్రికర్సర్స్ యొక్క చేరవేత తాలూకు వివరాల ను అభ్యర్థించిన మేరకు అందజేసేందుకు, అలాగే మాదక పదార్థాల దొంగ రవాణాదారులు, మాదక పదార్థాల ఉత్పత్తిదారులు, మాదక ద్రవ్యాల అక్రమ చేరవేతదారుల ను గుర్తించడం, అటువంటి వారి ని డ్రగ్ సంబంధిత అభియోగాల పై అరెస్టు చేసినప్పుడు వారి యొక్క ఆర్థిక వివరాల ను పరస్పరం అందజేసుకొనే పద్ధతుల ను పేర్కొనడం జరిగింది.అరెస్టు చేసిన పౌరుని వివరాల ను అవతలి పక్షం వారి కి నోటిఫై చేసేందుకు సంబంధించిన నిబంధన ను కూడా ఎంఒయు లో పేర్కొన్నారు. అరెస్టయిన వ్యక్తి కి కాన్సులర్ యాక్సెస్ కల్పన తాలూకు నిబంధన ను సైతం ఇందులో చేర్చడమైంది. ఈ ఎంఒయు లో మాదక పదార్థాలు, ఇరు దేశాల లో భూభాగం లో స్వాధీనం చేసుకొన్న సైకోట్రాపిక్ సబ్ స్టన్సెస్ మరియు ప్రికర్సర్ కెమికల్స్ తాలూకు విశ్లేషణ/రసాయనిక సంబంధ నివేదిక ల ఆదాన- ప్రదానాని కి, అలాగే నార్కటిక్ డ్రగ్స్ ను, సైకోట్రాపిక్ సబ్ స్టన్సెస్ ను మరియు ప్రికర్సర్ కెమికల్స్ ను దొంగతనం గా తయారు చేస్తున్న ప్రయోగశాలల కు సంబంధించినటువంటి సమాచారాన్ని/డేటా ను, ఆయా సైకోట్రాపిక్ సబ్ స్టన్సెస్ మరియు ప్రికర్సర్ కెమికల్స్ యొక్క సాంకేతిక ప్రత్యేక వివరణ లను ఉభయ పక్షాలు పరస్పరం ఇచ్చి, పుచ్చుకొనేందుకు వెసులుబాటు లను కూడాను కల్పించడమైంది.