YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

15వ ఆర్థిక సంఘం నివేదిక‌ ల స‌మ‌ర్ప‌ణ గ‌డువు పొడిగింపు 

15వ ఆర్థిక సంఘం నివేదిక‌ ల స‌మ‌ర్ప‌ణ గ‌డువు పొడిగింపు 

15వ ఆర్థిక సంఘం నివేదిక‌ ల స‌మ‌ర్ప‌ణ గ‌డువు పొడిగింపు 
న్యూడిల్లీ 
పదిహేనో ఆర్థిక సంఘం పరిధి, పరిమితి సహా రెండు నివేదిక ల సమర్పణ గడువు పొడిగింపు నకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న నేడు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తొలి ఆర్థిక సంవత్సరం- అంటే 2020-21కి సంబంధించిన తొలి నివేదిక తో పాటు 2021-22 నుండి 2025-26 మధ్య ఆర్థిక సంవత్సరాల తుది నివేదిక సమర్పణ కు వెసులుబాటు ను కల్పిస్తూ 2020వ సంవత్సరం అక్టోబరు 30వ తేదీ దాకా పదవీకాలాన్ని కూడాను పొడిగించింది.ఈ పొడిగింపు తో 2020-2026 మధ్య కాలానికి సంబంధించి తన సిఫారసు ల ఖరారు దిశ గా సంస్కరణలు, సరికొత్త వాస్తవాల దృష్టి తో ఆర్థిక అంచనా ల రూపకల్పన కోసం వివిధ అంశాల‌ ను పరిశీలించే అవ‌కాశం 15వ ఆర్థిక సంఘాని కి ల‌భిస్తుంది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ నియ‌మావ‌ళి ఫ‌లితంగా ఆంక్ష‌లు అమ‌లవుతున్న కార‌ణంగా వివిధ రాష్ట్రాల్లో త‌న ప‌రిశీల‌న‌ను ఆర్థిక సంఘం ఇటీవ‌లే పూర్తి చేయ‌గ‌లిగింది. ఈ ఆల‌స్యం వ‌ల్ల ఆయా రాష్ట్రాల అవ‌స‌రాల‌ తాలూకు అంచ‌నా ల రూప‌క‌ల్ప‌న‌ పైన ప్ర‌భావం ప‌డింది.ఈ నేపథ్యం లో ఆర్థిక సంఘాని కి నిర్దేశించిన పరిశీలనాంశాలు విస్తృత పరిధి ని కలిగివున్నాయి.  అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల ను, ఆవశ్యకతల ను సమన్వయం చేస్తూ సంబంధిత అంశాల పై సమగ్ర పరిశీలన కు అదనపు సమయం అవసరమవుతుంది.  ఆ మేరకు ఆర్థిక సంఘం సిఫారసు లు వర్తించే వ్యవధి పొడిగింపు వల్ల అటు  కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యంతర వనరుల ప్రణాళిక కు వీలు కలుగుతుంది.  ఆర్థిక సంఘం యొక్క పరిధి ని 2021 ఏప్రిల్ 1 తర్వాత అయిదు సంవత్సరాలు పాటు పొడిగించడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక దృక్పథం తో పథకాల ను రూపొందించుకొనేందుకు వెసులుబాటు లభిస్తుంది.  అలాగే పథకాల ను మధ్యలో సమీక్షించుకొని, సరిదిద్దుకొనేందుకు సమయం సైతం లభిస్తుంది.  కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చేపట్టిన సంస్కరణ ల ప్రభావానికి చెందిన గణాంకాలు 2020-21 తొలి త్రైమాసికం చివర లో వెల్లడి అయ్యేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Related Posts