YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పాస్టర్లకు, ఇమామ్ లకు జీతాలపై కోర్టు నోటీసులు

పాస్టర్లకు, ఇమామ్ లకు జీతాలపై కోర్టు నోటీసులు

పాస్టర్లకు, ఇమామ్ లకు జీతాలపై కోర్టు నోటీసులు
గుంటూరు,
పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజామ్‌లకు జీతాల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో తూర్పుగోదావరికి చెందిన వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై స్పందించిన హైకోర్టు.. బుధవారం దీనిపై విచారణ చేపట్టింది. ఏ నిబంధనల ప్రకారం వారికి పారితోషికం ఇచ్చేందుకు నిర్ణయించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. చర్చి పాస్టర్లకు జీతాలివ్వాలని వైఎస్‌ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి.తాము అధికారంలోకి వస్తే చర్చి పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. ఈ హామీ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో వివాదం రాజుకుంది. దేవాదాయశాఖ కిందకు ఆలయాలు వస్తాయి కాబట్టి.. వాటి నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో దేవాదాశాఖ ఉద్యోగులు, అర్చకులు, ఇతరులకు జీతాలు చెల్లిస్తారు.అలాగే ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బోర్డ్ ఉంటుంది. వక్ఫ్ బోర్డుకి కూడా భారీగా ఆస్తులు, ఆదాయం ఉంటాయి. ఈ బోర్డును ప్రభుత్వమే నియమిస్తుంది. ఆ బోర్డుకు ప్రభుత్వం ఇచ్చే నిధులు, వచ్చే ఆదాయంతో కలిసి ముస్లింల సంక్షేమానికి వినియోగిస్తారు. కానీ, చర్చిలకు సంబంధించినంత వరకూ ఏపీలో ఎలాంటి వ్యవస్థ లేదు. క్రిస్టియన్ సంస్థలు చాలా ఉన్నా వాటితో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఈ నేపథ్యంలో పాస్టర్లకు జీతాలు ఎవరి సొమ్ముతో చెల్లిస్తారన్నది.. చర్చనీయాంశం అవుతోంది.

Related Posts