లాభాల్లో స్టాక్ మార్కెట్లు
న్యూఢిల్లీ,
దేశీ స్టాక్ మార్కెట్ జోరు మీదుంది. గురువారం కూడా బెంచ్‌మార్క్ సూచీలు కొత్త రికార్డు స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 109 పాయింట్ల లాభంతో 41,130 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సూచీకి ఇది కొత్త ముగింపు స్థాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 41,163 పాయింట్ల కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది.మరో బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ కూడా పరుగులు పెట్టింది. 50 పాయింట్లు పెరిగింది. దీంతో 12,154 పాయింట్ల సరికొత్త రికార్డు ముగింపు స్థాయి వద్ద క్లోజయ్యింది. బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో నిఫ్టీ బ్యాంక్ తొలిసారిగా 32,000 పాయింట్ల మార్క్‌ను తాకింది.
✺ నిఫ్టీ 50లో భారతీ ఇన్‌ఫ్రాటెల్, యూపీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యస్ బ్యాంక్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఏకంగా 14 శాతానికి పైగా ర్యాలీ చేసింది.
✺ అదేసమయంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్, హీరో మోటొకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. హీరో మోటొకార్ప్ 2 శాతానికి పైగా పడిపోయింది.
✺ నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. ఒక్క నిఫ్టీ ఆటో ఇండెక్స్ మినహా మిగతావన్నీ లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 3 శాతానికి పైగా పరుగులు పెట్టింది. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా పెరిగాయి.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.27 శాతం తగ్గుదలతో 62.84 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.48 శాతం క్షీణతతో 57.83 డాలర్లకు తగ్గింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. 26 పైసలు నష్టంతో 71.62 వద్ద కదలాడుతోంది.
✺ అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ర్టీస్ (RIL) కొత్త రికార్డును క్రియేట్ చేసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీగా రిలయన్స్ సత్తా చాటింది. గురువారం ఆర్‌ఐఎల్ షేరు ధర రూ.1580 వద్ద క్లోజయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రచ్దూ.10 లక్షల కోట్లు దాటింది.