ఆర్టీసీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి
భద్రాద్రి:
భధ్రాధ్రికొత్తగుడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ కార్మికుల సమ్మె లొ భాగంగా ఎమ్మార్పీయస్ వ్వవస్థాపక అద్యక్షులు మందకృష్ణ మాదిగ, కార్మికుల సమ్మె కు సంఘీభావం సంపూర్ణ మద్దతు తెలిపారు. అయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కారం చేసి విధులలోకి తీసుకోవాలని కోరారు. లేనియెడల ఆర్టీసీ కార్మికుల సమ్మె ను ప్రజా ఉద్యమం గా ముందుకు తీసుకేల్తామని ముఖ్యమంత్రి ని హెచ్చరించారు. కె సి ఆర్ మొదటి నుంచి ఆర్టీసీ ని ప్రవేటు పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారని , లోటు బడ్జెట్ ఉన్నా పక్కన ఉన్న రాష్ట్ర ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేశారు. మిగులు బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ ని ప్రబత్వంలో విలీనంలో చేయకపోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు. ఈకార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు బొళ్ళజు అయోద్య, కాటబోయిన నాగేశ్వరావు. మోర రవి, నజీర్ పాష, చలపతిరావు, ఆర్టీసీ జె ఎ సి నాయకులు కృష్ణ కార్మికులు పాల్గొన్నారు