వైద్య సేవల్లో జగిత్యాల జిల్లాకు ద్వితీయ స్థానం జగిత్యాల
వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమావేశంలోజగిత్యాల జిల్లా కు వైద్య సేవల్లోని అన్నిరంగాల్లో ద్వితీయ స్థానం లభించిందని జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ తెలిపారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి సబ్ కలెక్టర్ గౌతమ పోట్రూ సూచనలు మేరకు కృషి చేసి సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో రాష్ట్రంలో ద్వితీయ స్థానానికి చేరుకున్నామని వెల్లడించారు.గడిచిన ఆరు నెలలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆ తర్వాత నాలుగో స్థానానికి చేరుకుంది. తర్వాత అధికారుల ప్రోత్సాహంతో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రెండవ స్థానానికి చేరుకుందన్నారు. వైద్యాధికారి సన్మానం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన డిసెంబర్ 26, 27 తేదీలలో హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ద్వితీయ స్థానం పొందినందుకు గాను మంత్రి ఈటల రాజేందర్ చేతులమీదుగా 27న జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో టిఎస్ ఎంఐడి చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి,హెల్త్ సెక్రటరీ శాంత కుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ యోగితా రాణా,ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు,రమేష్ రెడ్డి,అశోక్ కుమార్ ఉన్నారు. ద్వితీయ స్థానం పొందటానికి సహకరించిన వైద్యాధికారులు కృషి చేసిన వైద్య సిబ్బందికి, ప్రజలకు వైద్యాధికారి శ్రీధర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.