YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

మార్గశిర లక్ష్మిపూజ

మార్గశిర లక్ష్మిపూజ

 

మార్గశిర లక్ష్మిపూజ
చాలా కాలం కిందట ఒకవూర్లో ఒక బ్రాహ్మణ కుటుంబం వుండేది . ఇల్లాలు చాలా గయ్యాళి , ఆమె మాటకు యెదురు చెప్పే సాహసం ఆ యింట్లో యెవరికీ లేదు . అతి ధనవంతురాలవటం వల్ల ఆమె యెవరినీ లెక్కచేసేదికాదు . శుచిశుభ్రం పాటించేదికాదు . ఆమె కి ఒకకూతురు , కొడుకు . కూతురు తల్లిలా కాక మృదుభాషి , దైవభక్తి కలది . తల్లికి తెలియకుండా పెరట్లో చెట్టుకింద పూజలు చేసుకొనేది . ప్రతీ సంవత్సరం లానే మార్గశిరమాసం లో గురువారం వచ్చింది , కూతురు లక్ష్మి పూజ చెయ్యాలని తల్లిని పూజాసామగ్రి కొనవలసినదిగా కోరుతుంది . అహంకారి అయిన తల్లి కూతురును పూజనీ కూడా నానా మాటలు అని పూజచేయరాదని చెప్పి కూతురును యింటికి వచ్చిన పంటకు కాపలా వుంచి చెరువుకి వెళ్తుంది . లక్ష్మీదేవి పూజాసామానులమ్మే ఆమెగా వేషం వేసుకొని ఆ వూరిలో యే యిల్లు శుచీశుభ్రంగా వుందో , యెవరు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారో చూసే నిమిత్తం వస్తుంది .
ఆమెను చూసిన కూతురు కాస్త ధాన్యం యిచ్చి పూజా సామగ్రిని తీసుకొని పెరట్లో చెట్టుకింద లక్ష్మీపూజ చెయ్యడం లో మునిగి పోతుంది . చెరువునుంచి వచ్చిన తల్లి పంటకు కాపలా వుంచిన కూతురు కనబడక కోపంతో పెరటిలోకి వచ్చి చూడగా కూతురు పూజాసామగ్రితో లక్ష్మీదేవిపూజ చేస్తూండడం చూసి లక్ష్మీదేవి విగ్రహాన్ని కాలితో తన్ని కూతురును యీడ్చుకొని వచ్చి పూజాసామగ్రి అమ్మిన ఆమెను వెతికి పట్టుకొని చిదకబాది కూతురు యిచ్చిన ధాన్యాన్ని తీసుకుని పూజా సామగ్రిని విసిరేస్తుంది  .
లక్ష్మీదేవి తల్లి మీద అలిగి ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటుంది . కాని తన భక్తురాలయిన కూతురు ఆ యింటవున్నంతవరకు తానేమీ చెయ్యలేనని తెలిసిన లక్ష్మీదేవి కూతురు వివాహమయి ఆమె అత్తవారింటికి పోగానే లక్ష్మీదేవి ఆయింటిని విడిచి వెళ్లిపోతుంది . లక్ష్మీదేవి వెళ్లిపోగానే ఆ యింట దరిద్రదేవత ప్రవేశిస్తుంది . ఆ కుటుంబం తినడానికి తిండిలేక కట్టుకొనేందుకు బట్టలు లేక నానా యిబ్బందులు పడసాగేరు . కొడుకుని దీన స్థితిలో చూడలేని తల్లి కొడుకును కూతురివద్దకు పంపుతుంది . 
తన యింటికి వచ్చిన తమ్ముని దీన స్థితికి కన్నీరు కార్చి కట్టుకుందుకు మంచిబట్టలు యిచ్చి తినడానికి పిండివంటలు పెట్టి కొన్నాళ్లుంచుకొని తిరిగి తమ్ముడిని  పంపేస్తూ యెలాగైనా తల్లికి కొంత సొమ్మును చేరవెయ్యాలని ఆలోచన చేస్తుంది కూతురు .  మార్గమధ్యంలో దోపిడీ దొంగలబారిన పడకుండా సొరకాయ లో సొమ్ములు దాచి జాగ్రత్తగా సొరకాయ తల్లికి మాత్రమే యివ్వమని చెప్పుతుంది . అక్క సొరకాయ యెందుకు యిచ్చినదీ తెలియని తమ్ముడు మార్గ మధ్యలో సొరకాయ పక్కన పెట్టుకొని చెట్టునీడలో సేదతీరుతూ వుండగా లక్ష్మీదేవి గ్రద్దరూపంలో వచ్చి సొరకాయను యెత్తుకుపోయి కూతురు పెరట్లో పడవేస్తుంది . 
బరువు తగ్గిందని సంతోషించిన తమ్ముడు వూరుచేరి అక్క సొరకాయ యిచ్చినట్లు , దానిని గ్రద్ద యెత్తుకు పోయిన వైనం తల్లికి చెప్తాడు . తిండికి లేని తమకు సొమ్ములు పంపకుండా సొరకాయ యెందుకిచ్చినట్లో అర్దం కాని తల్లి సొరకాయ గ్రద్ద యెత్తుకు పోయినందుకు సంతోషిస్తుంది .
కొంత కాలం తరువాత తండ్రిని కూతురుని అడిగి కాస్త సొమ్ము తెమ్మని  పంపుతుంది తల్లి , తండ్రిని చూసిన కూతురు అతనికి స్నానం చేయండి మంచిబట్టలు యిచ్చి తినడానికి మంచి భోజనం యేర్పాటు చేస్తుంది . కూతురనుంచి సహాయం అర్ధించడానికి మనసువొప్పని తండ్రి కొద్దిరోజులు గడిచేక  వూరికి బయలుదేరుతాడు . వయసుమళ్లిన తండ్రికి చేతికర్రలో బంగారం నింపి యెక్కడా కర్రను విడిచిపెట్టొద్దని   తండ్రిని హెచ్చరిస్తుంది కూతురు .
ధనాన్ని యిస్తుందనుకున్న కూతురు చేతికర్ర యివ్వడం తో నిరాశగా వెనుతిరిగిన తండ్రి మార్గమధ్యంలో చెట్టుకిందన నిద్రపోతూవుండగా గ్రద్దరూపంలో వచ్చిన లక్ష్మీదేవి ఆకర్రను తెచ్చి కూతురు యింటి ముంగిలిలో పడవేస్తుంది . 
కూతురు ధనం పంపుతుందని యెదురు చూస్తున్న తల్లి జరిగింది విని నిట్టూర్చి తినిడానికి యేమీలేక రోజులు భారంగా గడిపి ఒకరోజు కూతురు దగ్గరకు తానే వెళ్లాలని నిర్ణయించుకుంటుంది .
ఆమె కూతురింటికి వచ్చేసరికి మార్గశిరమాసం వస్తుంది , కూతురు తల్లి చేత లక్ష్మీ పూజచేయించడానికి ప్రయత్నంచగా తల్లి ఓ మారు చద్దన్నం తినేసి , మరోమారు నూనె తలకు శరీరానికి రాసుకొని పూజకు అర్హతలేకుండా చేసుకుంటుంది . ఆఖరువారం తల్లి కొంగును తన కొంగుకి కట్టుకొని తిప్పుకుంటూ పూజకు కూర్చోగా లక్ష్మీదేవి వెనుకకు తిరిగిపోతుంది . కూతురు కారణం అడుగుగా లక్ష్మీదేవి కూతురుకు ఆమె చిన్నతనాన ఆమె తల్లి చేసిన అపచారం గుర్తుచేసి ఆమె చేసే పూజను తాను స్వీకరించనని చెప్తుంది . కూతురు పరిపరివిధాలుగా ఆమెను స్థుతించగా కరుణించిన కరుణామయి మార్గశిరమాసంలో చెయ్యకూడని పనులు చెప్పి పుష్యమాసంలో ఓ గురువారం పుట్టింటి వారి భోగభాగ్యాలకొరకు ఆడపిల్లలు లక్ష్మీ పూజచేసుకొని అమ్మవారికి పూర్ణం నైవేద్యంగా సమర్పిస్తే  పుట్టింట యెప్పుడూ లక్ష్మీకటాక్షం వుంటుందని శలవిస్తుంది .
పుష్యమాసం రాగానే కూతురు గురువారం నాడు యధావిధిగా లక్ష్మీపూజచేయగానే ఆమెపుట్టిల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది . ఆనాటినుండి తల్లికూడా దురుసు ప్రవర్తన మానుకొని వినయవిధేయతలతో వుంటూ లక్ష్మీ పూజ యధావిధిగా చేసుకుంటూ లక్మీకటాక్షం పొందింది . 
అప్పటి నుంచి మహిళలు మార్గశిరమాసంలో అన్ని లక్ష్మివారాలు లక్ష్మీదేవికి యధాశక్తి పూజా నైవేద్యాలు చేసుకొని పుష్యమాసంలో ఓ గురువారం పూజానైవేద్యాలతో మార్గశిరలక్ష్మీపూజ పూర్తిచేస్తారు .
మన పొరుగు రాష్ట్రం మైన ఒడిస్సాలో మార్గశిర లక్ష్మి వారాలు యెలా జరుపుకుంటారో తెలుసుకుందాం .
మనకి అమావాస్యతో నెల అంతమయితే వారికి పున్నమితో అంతమవుతుంది , అంటే వారికి నెలమొదలయిన 15 రోజులకు మన నెల మొదలవుతుంది . మనకి మొదటి మార్గశిర లక్ష్మివారం  వచ్చేసరికి వారికి మూడో వారం వస్తుంది .
మార్గశిర లక్ష్మివారం పూజకు రెండు మూడు రోజులనుంచే హడావుడి మొదలవుతుంది . ఇల్లు శుభ్రంగా కడిగి ముగ్గులు వేస్తారు . గుమ్మంలో యెర్రమన్నుతో గాని పేడతోగాని అలికి తెల్లని రుబ్బిన బియ్యంపిండితో ముగ్గులు వేస్తారు . ఆ ముగ్గులలో తామరపువ్వు , దీపం , మీనం , లక్ష్మి దేవి పాదాలు తప్పకుండా వుంటాయి . లక్ష్మీదేవిని కొత్త ధాన్యంతోనూ , రకరకాలపూలతోనూ అలంకరించి పూజలు చేస్తారు . అమావాస్య తర్వాత వచ్చే గురువారం ' మాణొబొస  గురుబారొ ' గా జరుపుకుంటారు . ఆ రోజు బియ్యం కొలిచే కొలత కొత్తవెదురుతో చేసిన బుట్ట ( కుంచం అనుకోవచ్చు ) పసుపుకుంకుమలతో అలంకరించి కొత్తధాన్యం పోయిన పీటమీద వుంచి నిండా కొత్త ధాన్యం పోసి దానిపైన పసుపుతో కడిగిన మూడు తమలపాకులను వుంచి పూలు కాయలతో అలంకరించి పూజలు చేసి కొబ్బరి , బెల్లం , బియ్యం తో చేసిన పదార్ధాలను నివేదిస్తారు . పూజ తరువాత ' బలరామదాసు ' రచించిన ' మహలక్ష్మీ పురాణ పారాయణ చేస్తారు ' 
ఈ వ్రతాన్ని అన్ని జాతులవారూ చేస్తారు . 
 

Related Posts