YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సుజనా అత్యుత్సాహం వెనుక...

సుజనా అత్యుత్సాహం వెనుక...

సుజనా అత్యుత్సాహం వెనుక...
విజయవాడ, నవంబర్ 29  
కేంద్ర మాజీ మంత్రి పాత టీడీపీ నేత‌.. ప్రస్తుత బీజేపీ రాజ్యస‌భ ఎంపీ సుజ‌నా చౌద‌రి రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది. అయితే, ఈ ఏడాది టీడీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంట‌నే రాష్ట్రంలో జ‌గ‌న్ ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం, ఢిల్లీకి-ఏపీకి మ‌ధ్య మెసెంజ‌ర్‌గా మారి పోవడం తెలిసిందే. గ‌తంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్ని త‌ప్పులు జ‌రిగినా చూసి కూడా చూడ‌నట్టు వ్యవహ‌రించిన సుజ‌నా చౌద‌రి ఇప్పుడు జ‌గ‌న్ ప్రభుత్వం ఏం చేసినా.. త‌ప్పులు వెతుకుతున్నారు. అయితే, బీజేపీ వ్యూహం మేర‌కే ఆయ‌న న‌డుచుకుంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.కానీ, సుజ‌నా చౌద‌రి కి కూడా ఓ వ్యూహం ఉంద‌నేది అంద‌రికీ త‌లిసిందే. కేంద్రంలో గ‌తంలో ఆయ‌న స‌హాయ మంత్రిగా చ‌క్రం తిప్పారు. ఇప్పుడు కూడా అవ‌కాశం వ‌స్తే.. కేంద్రంలో మంత్రి ప‌ద‌వి కావాల‌ని కోరుతున్నా రు. అయితే దీనికి కొద్దిగాపోటీ ఉంది. త‌న సొంత సామాజిక వ‌ర్గానికే చందిన కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వరి కూడా బీజేపీలో కేంద్ర మంత్రి ప‌ద‌విపై క‌న్నేశారు. ఆమ కూడా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. అయినా కూడా కేంద్రంలోని త‌న ప‌లుకుబ‌డితో మంత్రిగా పీఠంఎక్కాల‌ని అనేక ప్రయ‌త్నాలు చేస్తున్నారు. దీంతో సుజ‌నా చౌద‌రి ఆమెను ఢీ కొట్టాల‌నే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలోనే త‌న వాణిని పెంచారు. జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శలు చేయ‌డంలోనూ కేంద్రంలోని ప‌థ‌కాల‌తో ముడిప‌డిన పీపీఏలు, పోల‌వ‌రం, రాజ‌ధాని వంటి విష‌యాల‌ను మాత్రమే సుజ‌నా చౌద‌రి ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. ఇసుక కోసం బీజేపీ పాద‌యాత్ర చేసినా.. నిరాహార దీక్షలు చేసినా సుజ‌నా చౌద‌రి దూరంగా ఉన్నారు. అయితే, అదే స‌మ‌యంలో ఆయ‌న ఎక్కడ ప్రెస్‌మీట్ పెట్టినా.. విద్యుత్ ఒప్పందాల విష‌యాన్ని, పోల‌వ‌రం ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తుతున్నారు. ప్రత్యేక హోదా అవ‌స‌రం లేద‌ని తీర్మానం చేసేశారు. దీంతో సుజ‌నా చౌద‌రి కేంద్రానికి చాలా అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తున్న నేత‌గా ఢిల్లీ వ‌ర్గాల్లో ముద్ర వేయించుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది.ఇక ఇటు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఎక్కువ‌గా టార్గెట్ చేస్తోన్న సుజ‌నా చౌద‌రి ఆ పార్టీపై తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని ఆ రెండు పార్టీల‌ను గంద‌ర‌గోళానికి గురి చేసేలా మాట్లాడుతున్నారు. అమిత్ షా సైతం ఏపీ బీజేపీలో ప్రస్తుతం సుజ‌నా చౌద‌రికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చలు న‌డుస్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సుజ‌నా చౌద‌రి కేంద్ర మంత్రి ఆశ‌లు ఎప్పుడు ఫ‌లిస్తాయో ? చూడాలి.

Related Posts