YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

హిట్ టాక్  తెచ్చుకున్న నిఖిల్

హిట్ టాక్  తెచ్చుకున్న నిఖిల్

హిట్ టాక్  తెచ్చుకున్న నిఖిల్
హైద్రాబాద్, నవంబర్ 29
అర్జున్ సురవరం...ముందు ముద్రగా మొదలయిన ఈ సినిమా ఆ తరువాత పేరు మార్చుకుని ఏడాదిగా విడుదల తేదీకోసం ఎదురుచూస్తుంది. ఎన్నో వివాదాలు ఎదుర్కొని, అన్ని అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు అర్జున్ లెనిన్ సురవరం. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం, ఈ సినిమా బావుంది అంటూ స్వయంగా మెగాస్టార్ సర్టిఫికెట్ ఇవ్వడం, నిఖిల్ సినిమాలపై ఉండే పాజిటివ్ వైబ్ కూడా కలిసొచ్చి ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అలా మంచి అంచనాల నడుమ థియేటర్స్‌లోకి వచ్చిన అర్జున్ సురవరం అనుకున్నట్టుగానే ఆకట్టుకున్నాడా?, లేక నిరాశపరిచాడా? అనేది ఇప్పుడు చూద్దాం.అర్జున్ లెనిన్ సురవరం( నిఖిల్) టీవీ99 అనే ఛానల్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తుంటాడు. అయితే బీబీసీ ఛానెల్‌లో పనిచెయ్యాలి అనేది అతని గోల్. ఒక స్ట్రింగ్ ఆపరేషన్ కోసం ఒక పబ్‌కి వెళ్లిన అర్జున్‌కి కావ్య(లావణ్య త్రిపాఠి) పరిచయం అవుతుంది. ఆమెకి తాను బీబీసీలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నట్టు చెబుతాడు. వాళ్ళిద్దరి పరిచయం కాస్త పెరిగి ప్రేమగా మారుతుంది. కానీ అంతలోనే అర్జున్ పనిచేస్తున్నది టీవీ99 అనే ఛానల్‌లో అని తెలుస్తుంది. దాంతో కావ్య అర్జున్‌ని అసహ్యించుకుంటుంది. కానీ తన తండ్రి వల్ల అర్జున్ ఎలాంటి వాడు అనేది తెలుసుకుంటుంది.ఈలోగా అర్జున్‌కి బీబీసీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జాబ్ వస్తుంది. అంతా హ్యాపీ అనుకున్న టైమ్‌లో అర్జున్ ది నకిలీ సర్టిఫికెట్ అని, ఎడ్యుకేషన్ లోన్ కింద అనేక బ్యాంక్స్ నుండి చాలా లోన్ కూడా తీసుకున్నాడు అని రకరకాల కేసుల్లో అతన్ని అరెస్ట్ చేస్తారు. అతన్ని మాత్రమే కాదు చాలామందిని నకిలీ సర్టిఫికెట్స్ కేసులో అరెస్ట్ చేస్తారు. అసలు ఈ నకిలీ సరిఫికేట్స్ కేసులు ఏంటి?, దానివెనుక ఉన్నది ఎవరు?,అర్జున్ వాళ్ళను ఎలా కనిపెట్టి ఆటకట్టించి నిర్దోషిగా నిరూపించుకున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.అర్జున్ లెనిన్ సురవరం సినిమా పేరుకే తమిళ్ సినిమా కనితన్‌కి రీమేక్ గానీ తెలుగు వెర్షన్‌లో చాలా మార్పులు చేసాడు ఈ సినిమా డైరెక్టర్ సంతోష్. కనితన్ ని తెరకెక్కించిన ఆ డైరెక్టరే ఆ హిట్ కథకి మార్పులు చేర్పులు చెయ్యడం వల్ల సినిమాలో సోల్ నిలబడింది. సినిమాని మొదలు పెట్టడమే డైరెక్ట్ పాత్రల స్వభావం, అతని ఎయిమ్ లాంటివి చూపిస్తూ బాగానే ఎంగేజ్ చేసాడు. ఇక వెన్నెల కిషోర్, సత్యల కామెడి కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యింది. మొదటి 20 నిమిషాల వరకు కూడా ఛానెల్ బ్యాక్ డ్రాప్, హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్, రెండు పాటలతో నడిచిన సినిమాలో అప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. నకిలీ సర్టిఫికెట్స్ కేసులో నిఖిల్ అరెస్ట్ అవ్వడం అనే ట్విస్ట్ సినిమాలో బాగా పేలింది.ఆ తరువాత కూడా హీరో స్ట్రగుల్ చూపించడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు. ఒక మంచి ఎమోషనల్ సీన్ తరువాత తనను ఈ కేసులో ఎలా ఇరికించారు అని తెలుసుకోవడానికి హీరో చేసే ఇవెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్‌లో కూడా వెన్నెల కిషోర్‌ని వాడుకుని కాస్త ఫన్ కూడా వర్క్ అవుట్ చెయ్యడంతో అది అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంది. కొన్ని కొన్ని సీన్స్ హీరోకి ఫేవర్‌గా డీల్ చేసినప్పటికి ఓవరాల్‌గా ఈ జోనర్ సినిమాలకు కావాల్సిన నెర్రేషన్ లో గ్రిప్పింగ్‌ని, సన్నివేశాల్లో టెంపో ని మాత్రం మైంటైన్ చేసాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా ఎంగేజింగ్‌గా సాగిన సినిమా సెకండాఫ్ మొత్తం కూడా అదే పాయింట్ పై నడవడంతో కొన్ని సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సీసీ టీవీ ఫుటేజ్‌లను వాడడం, పోలీస్ ఇంటరాగేషన్ లాంటివి మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటాయి.ఇక విలన్ హీరోని వెదికే సీన్స్ కూడా కాస్త సినిమాటిక్ లిబరిటీని తీసుకుని తెరకెక్కించాడు డైరెక్టర్. జర్నలిస్టులని భయపెట్టి తనని ఫాలో అవుతున్న హీరోని రీచ్ అయ్యే సన్నివేశాల్లో లాజిక్ కోసం వెదకకుండా ఉంటే సినిమాని ఎంజాయ్ చెయ్యొచ్చు. ఈ కథలో కొన్ని ఎమోషన్స్ కూడా ఉంటేనే సినిమాకి పరిపూర్ణత ఉంటుంది అని భావించిన డైరెక్టర్ సెకండాఫ్ లో హీరోకి సంబంధం లేకుండా పెట్టిన చిన్న ఎపిసోడ్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. కాకపోతే విలన్ డెన్ లోకి హీరో ఈజీగా ఎంటరయిపోయి అతని డేటా బేస్‌ని కాపీ చెయ్యడం, అలాగే క్లయిమాక్స్‌ని కాస్త హడావిడిగా ముగించడం వంటి విషయాల్లో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండి ఉంటే అవి సినిమాకు ప్లస్ అయ్యేవి.కెరీర్ మొదట్లో మిగతా హీరోలను ఇమిటేట్ చేస్తూ కాస్త ఓవర్ యాక్టింగ్ చేరినట్టు అనిపించే నిఖిల్ స్వామి రారా సినిమా నుండి మాత్రం సినిమాలో తన క్యారెక్టర్‌ని అర్ధం చేసుకుని, దానికి తగ్గట్టుగా నటించడం మొదలుపెట్టాడు. ఈ సినిమాలో కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా సూపర్ గా నటించాడు. ఎక్కడా కూడా పాత్ర పరిధిని దాటి నటించలేదు. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా కథలో భాగంగానే రావడంతో హీరోయిజం కూడా బాగానే పండింది.ఈ సినిమా కథ హీరో అన్నట్టుగా సాగడంతో మిగతా పాత్రలకు కూడా మంచి స్కోప్ దక్కింది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కూడా సినిమాకి కీలకంగా నిలిచింది. హిట్ చూసి చాలాకాలం అయిన లావణ్య త్రిపాఠికి ఈ సినిమా మంచి విజయం అందించింది. ఇక వెన్నెల కిషోర్ కనిపించింది తక్కువ సమయమే అయినా ఎంటర్టైన్ చేసాడు. సత్య, విద్యుల్లేఖ కూడా కామెడీ పండించడానికి బాగానే హెల్ప్ అయ్యారు. నాగినీడు, ప్రగతి, రాజా రవీంద్ర, కిషోర్ పాత్రలు కూడా బావున్నాయి. ఇక ఛత్రపతి శేఖర్ చిన్న పాత్రే చేసినా కూడా అది కనెక్టింగ్‌గా అనిపించింది.ఖైదీ నెంబర్ 150తో తెలుగులో విలన్‌గా పరిచయం అయిన తరుణ్ అరోరా ఈ సినిమాలో కూడా మంచి విలనిజం చూపించాడు. కాకపోతే అతని పాత్ర నిడివి కూడా తక్కువగానే ఉంటుంది. మిగతావాళ్లంతా తమ పాత్రలపరిధి మేర నటించి అలరించారు.ఈ మధ్య మంచి ఫామ్‌లో ఉండి తన నేపధ్య సంగీతంతో సినిమాలకి ప్రాణం పోస్తున్న సామ్ C.S ఈ సినిమాకి కూడా సూపర్ మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా నుండి బయటికి వచ్చాక కూడా మైండ్‌లో రిపీట్ అవుతుంది. మూడు పాటలు కూడా డీసెంట్‌గా ఉన్నాయి. డైరెక్టర్ T.సంతోష్ తెలుగు వెర్షన్‌ని కూడా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. అవి సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.కిర్రాక్ పార్టీ అనే రీమేక్ సినిమాతో ట్రాక్ తప్పిన నిఖిల్ మరొక రీమేక్ సినిమాతో హిట్ అందుకుని మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చాడు. ఇక ఈ సినిమాలో చూపించిన సోషల్ ఇష్యూ కూడా చాలామందికి కనెక్ట్ అవుతుంది.అలాగే క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అందరికి అప్పీల్ అయ్యే కంటెంట్ కావడంతో కలెక్షన్స్‌కి కూడా ఢోకా ఉండకపోవచ్చు. ఓవరాల్‌గా చూస్తే మాత్రం అర్జున్ సురవరం అనేది హిట్ బొమ్మ.

Related Posts