YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

.నలుగురుని చంపండి

.నలుగురుని చంపండి

.నలుగురుని చంపండి
హైద్రాబాద్, నవంబర్ 29
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని దారుణంగా హత్యచేసిన మృగాలను చంపేయాలంటూ ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ గళాన్ని వినిపిస్తున్నారు. #RipPriyankaReddy, #JusticeForPriyankaReddy హ్యాట్‌ట్యాగ్‌తో ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఇంత దారుణానికి పాల్పడిన నేరగాళ్లను జైలు శిక్షతో సరిపెట్టకూడదని, ఆఖరి క్షణాల్లో ఆమె ఎంత నరకం అనుభవించిందో అంత నరకాన్ని చూపించాలని కోరుతున్నారు.2012, డిసెంబరు 16న కూడా ఢిల్లీలో చోటుచేసుకున్న అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని ప్రవేశపెట్టినా ఫలితం లేకపోయింది. దేశంలో అత్యాచారాల సంఖ్య పెరుగుతున్నాయే గానీ.. తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి కారణం.. అత్యాచారానికి కఠిన శిక్షలు విధించకపోవడమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. పలు దేశాల్లో అత్యాచార నేరగాళ్లకు మరణ దండన విధిస్తారని, ఇండియాలో మాత్రం జైలు శిక్షతో సరిపెడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన నలుగురు అనుమానితులు లారీ డ్రైవర్, క్లీనర్లని తెలుస్తోంది. చనిపోవడానికి ముందు ప్రియాంక తన చెల్లితో మాట్లాడిన ఆఖరి ఫోన్ కాల్‌లో సైతం తనని లారీ డ్రైవర్లు చూస్తున్నారని, భయంగా ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో వారే ఆమెను రేప్ చేసి చంపేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అప్పట్లో నిర్భయ ఘటనలో అరెస్టయిన దోషులు సైతం బస్సు డ్రైవర్, క్లీనర్లే కావడం గమనార్హం. నిర్భయను బస్సులో తిప్పుతూ అత్యాచారం చేయగా, ప్రియాంక రెడ్డిని లారీలను అడ్డుగా పెట్టి అత్యాచారం చేసి, వంతెన కిందికి తీసుకెళ్లి చంపేసినట్లు సమాచారం. మరి, ఇంత దారుణానికి పాల్పడుతున్న ఇలాంటి మృగాలకు ఎలాంటి శిక్ష వేయాలి?

Related Posts