సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
ఎఐటియుసి
నంద్యాల నవంబర్ 29
కేంద్రంలో మోడీ సర్కార్ కార్మిక వర్గం పై ఎక్కుపెట్టిన దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా జనవరి 8వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటియుసి కర్నూలు జిల్లా అధ్యక్షులు పి సుంకయ్య పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ లో నీ సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ప్రసాదు ఏఐటియుసి నంద్యాల నియోజకవర్గం కార్యదర్శి బాల వెంకట్ ఉపాధ్యక్షులు చిరంజీవి మహమ్మద్ సుభాష్ లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పి సుంకయ్య మాట్లాడుతూ మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక హక్కులు కాలు రాయడంతో పాటు లాభాల్లో నడుస్తున్న టువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటానికి ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. అందులో భాగంగానే రైల్వేలు బ్యాంకులు ఎల్ఐసి లాంటి లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగా సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి పన్నాగం పడుతున్నారని దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 10 దేశవ్యాప్త కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. మొత్తం 12 డిమాండ్లపై సమ్మె జరుగుతుందన్నారు. ఈ సమ్మె ఉద్యోగులు కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి నాయకులు పాల్గొన్నారు.