24గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.
నంద్యాల నవంబర్ 29
నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శాంతి రాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆర్జీఎం, మరియు శాంతి రాం విద్యాసంస్థల ఛైర్మన్ డా మిద్దె శాంతి రాముడు శుక్రవారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల పట్టణం , చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు 24గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచడమే లక్ష్యం గా పద్మావతి నగర్ లో శాంతి రాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశామని తెలిపారు.ఇటీవల రాత్రి వేళల్లో ఎక్కువగా గుండె పోటు రావడం సర్వసాధారణమైపోయిందని, అందుకే ఎమర్జెన్సీ విభాగం ఏర్పాటు చేశామన్నారు.అలాగే ట్రామాకేర్ తో పాటు, 20 విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలు, ఉంటాయని తెలిపారు. శాంతి రాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిద్దె రఘు రాం మాట్లాడుతూ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ కోసం నలుగురు వైద్యులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారన్నారు.అలాగే వెంటిలేటర్ సదుపాయం, గుండె జబ్బులను గుర్తించే పరీక్షలు, ప్రాణ రక్షణ అవసరమైన అత్యాధునిక మందులను అందుబాటులో ఉంచామన్నారు అలాగే గుండె కు సంబంధించి కార్డియాక్ థొరాసిక్ సర్జరీ, క్యాన్సర్ కు సంబంధించి సర్జికల్ అంకాలజీ, రేడియాలజీ, ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్లాస్టిక్ సర్జరీ, ఎముకలు విరిగిన వారికి ఆర్థోపెడిక్ సర్జరీ లు, చేయడం జరుగుతుందన్నారు.అలాగే చిన్నపిల్లల మహిళల వ్యాధులకు, మూత్రపిండాల వ్యాధులకు, కడుపులో గ్యాస్ సంబంధిత సమస్య లకు, చికిత్స లు అందుబాటులో ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో శాంతి రాం హాస్పిటల్ ఎం డీ రవిబాబు, శాంతి రాం విద్యాసంస్థల ఛైర్మన్ డా మాధవీలత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీకాంత్,పట్టణ ప్రముఖులు జేపీ వెంకటేశ్వర్లు,డా గెలివి సహదేవుడు,డా.సాయికృష్ణ,డా రవికృష్ణ,డా నర్మద,డా.కార్తికి, తదితరులు పాల్గొన్నారు.