YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

30 రోజుల ప్రణాలికలో చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులు వెంటనే  చెల్లించాలి  జిల్లా కలెక్టర్. డాక్టర్. ఏ.శరత్

30 రోజుల ప్రణాలికలో చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులు వెంటనే  చెల్లించాలి  జిల్లా కలెక్టర్. డాక్టర్. ఏ.శరత్

30 రోజుల ప్రణాలికలో చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులు వెంటనే  చెల్లించాలి 
జిల్లా కలెక్టర్. డాక్టర్. ఏ.శరత్
జగిత్యాల నవంబర్ 29  
30 రోజుల ప్రణాలికలో చేపట్టిన  పనుల పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే  చెల్లించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ.శరత్ ఆదేశించారు.  జిల్లాలో 30రోజుల ప్రణాళిక పనులపై  శుక్రవారం  జిల్లా కలెక్టర్ డా. ఏ. శరత్ తన చాంబర్ లో అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ  గ్రామపంచాయితి ద్వారా చేయవలసిన ప్లానిటేషన్ కు సంబంధించిన మొక్కలను కనీసం 85శాతం బ్రతికించుకోవలసిందిగాను, గ్రామపంచాయితి మండల స్థాయి  ఇజియస్ కార్మికులకు ఇచ్చిన వివరాలు  తీసుకోని రావలసిందిగాను,  గ్రామపంచాయితి ప్లానిటేషన్ బాద్యత అనగా ట్రిగార్డుల ఏర్పాటు,  పాదులను ఏర్పాటుచేయుట,  మంకి ఫుడ్ కోర్డు,  కమ్యూనిటి ప్లాంటేషన్ బ్లాకుల వారిగా, ఇన్సిట్యూషనల్ ప్లానిటేషన్ పాఠశాలలు, తహసీల్దార్  కార్యాలయాలు, విద్యూత్ సబ్ స్టేషన్ లు, తదితర కార్యాలయాలలో ఖాళీగా  ఉన్న స్థలాలలో 100 మొక్కలు నాటినట్లయితే ఈజీయస్ క్రింద రిజీష్టర్లలలో విడివిడిగా నమోదులు చేసి ఏవరికి ఎక్కడి నుండి ఎన్ని మొక్కల బాద్యత అప్పగించారు.  వారి వివరాలు, వాటికి సంబంధించిన ప్లానిటేషన్ వివరాలను నమోదుచేసి తీసుకురావలసిందిగా   సంబంధిత అధికారులను ఆదేశించారు.   జిల్లాలోని 380 గ్రామాలలో  ప్రతి గ్రామములో డంపింగ్ యార్డు, వైకుంఠ దామం, నర్సరీలు,  మంజూరయిన వాటి పనులను వెంటనే పూర్తి చేసుకొవలసిందిగాను,  ప్రతి నర్సరీలో కృష్ణ తులసి  మొక్కలు కచ్చితంగా  పెంచే విధంగా ఎంపిడిఓ బాద్యత తీసుకోవాలని అన్నారు.  వీటికి సంబంధించిన ఫోటోలతో సమర్పించాల్సిందిగా కోరారు.   అదే విధంగా ప్రతి గ్రామంలో సోప్ పిట్లు  లేని దగ్గర గుర్తించి మంజూరు తీసుకోవాలని,  మంజూరు తీసుకున్న వాటిని డిసెంబర్ నాటికి పూర్తి చేయవలసిందిగా కోరారు.  30రోజుల కార్యక్రమంలో చేప్పటిన పనుల  పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే  చెల్లించాలని,  అదే విధంగా గ్రామపంచాయితీలలోని ప్రతి నెల వచ్చు బిల్లులను బుదవారంలోగా చెల్లించి వివరాలను సమర్పించవలసిందిగా ఆదేశించారు.    గ్రామపంచాయితీ లొని  విద్యూత్ మీటర్లు సరిగా పనిచేయుచున్నాయా లేదా చూడాలని, ఒక వేళ పనిచేయనట్లయితే వాటిని గుర్తించి సరిచేయించాలని అన్నారు.   ప్రతి గ్రామ పంచాయితీలో ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్  రహిత గ్రామాలుగా,  జిల్లాగా ఉండే విధంగా చూడాలని, గ్రామ పంచాయితీలలో ని ట్రిగార్డులకు బిల్లులు చెల్లించలేదని, డ్యూగల బిల్లులకు వెంటనే చెల్లింపులు చేయాలని, ఎమైన సమస్యలు ఉన్నట్లయితే వెంటనే దృష్టికి తీసుకురావలసిందిగా తెలిపారు.  ప్రతి గ్రామపంచాయితీ లలో  ట్రాక్టర్లు కొనుగోలు చేయుటకు  బ్యాంకర్ల వద్ద నుండి ప్రోసిడింగ్ లు పొందాలని ఇప్పటికే 18 గ్రామాల వారు  కొనుగోలుకు నూటికి నూరుశాతం చెల్లింపు చేయుటకు ఉన్నారని అవి బీర్పూర్ మః తూంగూర్, జగిత్యాల రూరల్ అంతర్గాం, చెల్గల్, కల్లేడ,  దర్మపురి మం: దొంతాపూర్,  మెడిపల్లి మండల కేంద్రం, బండ్లిలింగాపూర్,  మెట్పల్లి మః వెల్లుల,  మల్లాపూర్ మండల కేంద్రం, చిట్టాపూర్, మల్లాపూర్ మః శాతారం, రేగొండ, ఇబ్రహీపట్నం మండల కేంద్రం,  డబ్బా,  గూడూర్, కోరుట్ల మః  మోహన్ రావు పేట,  పైడిమడుగు, చిన్నమెట్ పల్లి, గ్రామపంచాయితీలలో  చెల్లింపులు చేసి ట్రాక్టర్  కొనుగోలు కు ప్రోసిడింగ్  లు పొందారని మిగిళిన గ్రామపంచాయితీలు ట్రాక్టర్ల కొనుగోలు  చెల్లింపులు చేసుకొని ప్రోసిడింగ్ లు తీసుకోవాలని అన్నారు.             ఈ కార్యక్రమంలో  డిపిఓ శేఖర్,  మండల పంచాయితీ అధికారులు, 18 గ్రామ పంచాయితీ సెక్రెటరిలు పాల్గోన్నారు. 

Related Posts