YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

సాయం చేసారు ఛలానా  రూపంలో  లాగేస్తున్నారు  ఆటో డ్రైవర్లపై ఆర్టీవో, పోలీసుల దాడులు ఆపకపోతే ఆందోళనలు ఉద్ధృతం 

సాయం చేసారు ఛలానా  రూపంలో  లాగేస్తున్నారు  ఆటో డ్రైవర్లపై ఆర్టీవో, పోలీసుల దాడులు ఆపకపోతే ఆందోళనలు ఉద్ధృతం 

సాయం చేసారు ఛలానా  రూపంలో  లాగేస్తున్నారు 
ఆటో డ్రైవర్లపై ఆర్టీవో, పోలీసుల దాడులు ఆపకపోతే ఆందోళనలు ఉద్ధృతం 
నంద్యాల నవంబర్ 29 
నంద్యాల పట్టణంలోని ఆటో డ్రైవర్లపై ఆర్టీవో ,ట్రాఫిక్ పోలీసుల దాడులు ఎక్కువ కావడం వలన ఫైన్ రూపంలో 500 నుంచి 10,000 రూపాయల పైన వేయడం సరైంది కాదని,ఈ దాడులను ఆపకపోతే సిఐటియు ఆందోళనలు ఉదృతం చేస్తామని, ఆర్టీవో ఆఫీస్ ముట్టడికి సిద్ధం అని ఏపీ ట్రాలీ, ఆటో డ్రైవర్స్ యూనియన్ డివిజన్ అధ్యక్షులు (సిఐటియు) లక్ష్మణ్ తెలిపారు.  ఈ సందర్భంగా శ్రీనివాస నగర్ లోని  శుక్రవారం నాడు ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు జమాల్, శ్రీనివాసులు, రాజశేఖర్, నాయక్ వీరితో పాటు మరో 30 మంది పాల్గొన్నారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకులు లక్ష్మణ్ మాట్లాడుతూ 2019 సాధారణ ఎన్నికల్లో  వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  ఆటో డ్రైవర్ల అందరికీ పదివేల రూపాయలు  సహాయం అందజేయడం మంచిదే , ఆటో డ్రైవర్ల కుటుంబ జీవనం కోసం ఎంతోకొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్న తరుణంలో. ఆర్టీవో,పోలీసు అధికారులు మాత్రం చలానా ల పేరుతో 500 రూపాయల నుండి పదివేల రూపాయల వరకు ఫైన్ లు వేస్తున్నారని, అయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పది వేలు రూపాయలు ఇచ్చినట్లు ఇచ్చి  అధికారులతో  దాడులు చేయించి లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు. .ఒకరోజు ఆటోడ్రైవర్ కష్టపడితే కేవలం 300 రూపాయలు మాత్రమే వస్తుందని,దాంతో జీవనం కొనసాగుతుందని అన్నారు. అధికారులు రోజుకు 4 సార్లు ఆటో డ్రైవర్ల పైన దాడులు చేసి ఇ చలానా ల పేరుతో వసూలు చేయడం దుర్మార్గమని వెంటనే ఆర్టీవో అధికారులు ,పోలీసు అధికారులు ఈ దాడులు ఆపకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీవో కార్యాలయం ముట్టడికి, అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇల్లు ముట్టడించేందుకు ఆటో డ్రైవర్ల అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Related Posts