యోగ పోటీలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
మందమర్రి నవంబర్ 29
డ్రీమ్ యోగ సెంటర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 15న నిర్వహించే యోగ పోటీలకు మందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్ పర్సన్ కొంపల్లి రమేష్ కుమార్ యోగా నిర్వాహకులు ముల్కల సాయి తేజ కు శుక్రవారం స్థానిక పెట్రోల్ బంక్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుస్కూరి నర్సింగరావు, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ సొత్తు సుదర్శన్ లు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో మనం తీసుకునే ఆహారంలో సరైన పోషక పదార్థాలు ఉండటం లేదని అలాగే వాతావరణ కాలుష్య సమస్యను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ యోగ, ధ్యానము అలవర్చుకొని సాధన చేయాలని అని తద్వారా ఆరోగ్యపరమైన సమస్యల నుండి బయట పడవచ్చని అనేక శాస్త్ర ప్రమాణాలు నిరూపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ కామిని మార్కండేయ, డైరెక్టర్లు పోలు శ్రీనివాస్, బింగి రాజన్న, షేక్ సిద్దిక్, కడారి జీవన్, కందునూరి రాజన్న న తదితరులు పాల్గొన్నారు.