కాగజ్ నగర్ లో డిఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్,
అసిఫాబాద్ నవంబర్ 29
కాగజ్ నగర్ పట్టణంలోని కౌసర్ నగర్, వార్డ్ నెంబర్ 14 ఏరియాలో శుక్రవారం రోజున డి.ఎస్.పి బి ఎల్ ఎన్ స్వామి ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ చేపట్టారు, అవార్డులో పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాల తో పాటు నిషేధిత గుట్కా పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. అలాగే వార్డులలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అగుపించిన చొ పోలీసులకు సమాచారం అందించాలని డి.ఎస్.పి తెలిపారు. ఈ కార్డెన్ సర్చ్ లో కాగజ్ నగర్ టౌన్ సిఐ మోహన్ తో పాటు రూరల్ సిఐ నరేందర్, ఎస్సైలు రవికుమార్, గంగన్న, రాజ్ కుమార్ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.