అక్రమ వడ్డీలకు అడ్డుకట్టెప్పుడు...
నల్గొండ, నవంబర్ 30
అక్రమ వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తమ అవసరాలకు అనుమతుల్లేని ప్రైవేటు ఫైనాన్స్‌లపై ఆధారపడుతున్న కారణంగా అడ్డగోలు వడ్డీలతో ముక్కు పిండుతున్నారు. రోజువారీ డీసీ వ్యాపారం యథేచ్ఛ గా సాగుతున్న తీరు ప్రజల జీవన ప్రమాణం పై తీవ్ర ప్రభా వం చూపుతోంది. పేద, మధ్య తరగతి వర్గాలు, నిరుపేద కూలీలు తమ అవసరాలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుండటంతో అధిక వడ్డీలు గుంజుతున్నారు. గతంలో వైట్ కాలర్ నేరాల నేపథ్యంలో అక్రమ ఫైనాన్స్ వ్యాపారులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించినా పరిస్థితిలో ఎంత మాత్రం మార్పు లేదు. ప్ర స్తుతం ఫైనాన్స్ వ్యాపారుల కదలికలు, వ్యాపారం తీరు తెన్నులు ఆసాంతం కళ్ల ముందున్నా నివారణా చర్యలు మృగ్యమయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే చోద్యం చూస్తు న్నారు. ఇప్పటికైనా అక్రమ ఫైనాన్స్ వ్యాపారుల ఆట కట్టించేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.కూలీ నాలీ పనులతో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న నిరుపేదలు డీసీల రూపంలో తీసుకున్న డ బ్బులో ముందస్తుగానే వడ్డీని తీసుకుంటున్నారు. ఉదాహరణకు రూ.10 వేలు తీసుకుంటే అందులో రూ. 1000 మినహాయించుకుని బాధితుడికి రూ.90 00 వేలు మాత్రమే ఇస్తారు. తీసుకున్న అప్పు 12 వారాల్లోగా చెల్లించడంలో భాగంగా రోజువారీ ముట్టజెప్పేందుకు సామాన్య జనం పడుతున్న తంటాలు వర్ణనాతీతం.మండల కేంద్రంలో డీసీ వ్యాపారం అడ్డూ అదుపు లేకుండా సాగుతుంది. గతంలో డీసీలు, చిట్టీల వ్యాపారం పేరుతో లక్షల్లో వ్యాపారం సాగించిన ఇరువురు సోదరులు కొద్ది నెలల క్రితం అప్పుల ఎగవేత పేరుతో ఐ.పీ. పెట్టడంతో జనం గొల్లుమన్నారు. ఇరువురు కలిసి సుమారు రూ. 5 కోట్లకు పెట్టిన ఐ.పీ.కారణంగా మండల కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన చిట్టీల బాధితులు తీవ్రంగా నష్టపోయారు. ఇంత జరిగినా ఎలాంటి లైసెన్స్‌లు లేకుండా లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నారు. గతంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కొద్ది రోజుల క్రితం అక్రమ ఫైనాన్స్ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహించి పలువురి నుంచి ప్రామిసరీ నోట్లు, తాకట్టు బంగారు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంత వరకు బాగానే ఉన్నా సదరు వ్యాపారులపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో తిరిగి డీసీ ఫైనాన్స్ వ్యాపారాన్ని నిరాంటంకంగా సాగిస్తుండడం పోలీసుల పనితీరును ప్రశ్నిస్తోంది.పోలీసు దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన ఫైనాన్స్ వ్యాపారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి డోకా లేకుండా చాక చక్యంగా ఫైనాన్స్ వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పోలీసు దాడుల నేపథ్యంలో అసలు వ్యాపారస్తుల జోలికి వెళ్లకుండా సాదా సీదా ఫైనాన్స్ వ్యాపారులతోనే సరిపె లోపాయికారి అవగాహనతో పోలీసు లు పరపతిని ఉపయోగించారన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఐ.పీ. పెట్టి పేదలకు ఎగ్గొట్టిన వారు కళ్ల ముందు యథేచ్ఛగా తిరుగుతుండగా అక్రమ ఫైనాన్స్ వ్యాపారానికి అలవాటు పడిన కొందరు మాత్రం చిరు వ్యాపారులు, దుకాణదారులు, బడ్డీ కొట్టు నిర్వాహకులకు డీసీ లు ఇస్తూ అధిక వడ్డీలు గుంజుతూ అక్రమార్జనకు పాల్పడుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అక్రమ ఫైనాన్స్ వ్యాపారులు అనతి కాలంలోనే లక్షలు గడించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సైతం చేస్తుండడం గమనార్హం.