YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

పింఛను వారోత్సవాల్లో పాల్గోన్న మంత్రి వెలంపల్లి

పింఛను వారోత్సవాల్లో పాల్గోన్న మంత్రి వెలంపల్లి

పింఛను వారోత్సవాల్లో పాల్గోన్న మంత్రి వెలంపల్లి
విజయవాడ నవంబర్ 30 
ఆటోమొబైల్ టెక్నిషియన్స్ అసోసియేషన్ హాల్ లో పింఛను వారోత్సవాలలో ముఖ్య అతిథిగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అసంఘటిత కార్మికుల భాగస్వామ్యం తో ఈ పెన్షన్ లో వారి వాటా ను చెల్లించడం ద్వారా వారికి స్వీయ గౌరవం ఉంటుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ కాకుండా మేము పొదుపు చేసుకున్న వాటి నుంచి పెన్షన్ రావడం తో ఎంతో భరోసా కలుగుతుందన్నారు. వృధ్యాప్యం లో ఆర్ధిక భారం పడకుండా అసంఘటిత కార్మికులకు, చిరు వ్యాపారులకు కనీస పింఛను కు ఎల్ ఐ సి ద్వారా హామీ ఇవ్వడం జరుగుతున్న దని మంత్రి తెలిపారు.  ఈ పథకంలో చేరిన అర్హులకు 60వ సం . నుండి ప్రతి నెల రు . 3000 / - లు జీవితకాలం పెన్షన్ పొందవొచ్చన్నారు.  వ్యవసాయ , అనుబంధ ఉపాధుల పనివారు,భవన మరియు ఇతర నిర్మాణాలలో పనివారు, చేతి వృత్తుల వారు, స్వయం ఉపాధి వారు, సేవారంగం వారు, ప్రభుత్వ పధకాలు అమలు పనివారు, రవాణా రంగం , దుకాణాలు, సంస్థ లలో పనిచేసే వారు తప్పకుండా ఈ పధకంలో చేరాలని మంత్రి తెలిపారు.  ఇందుకోసం వివిధ సంస్థలు వారి వద్ద పనిచేసే కార్మికుల కు చెందిన వాటా చెల్లింపు కు చొరవ చూపాలని తెలిపారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు చెందిన ప్రజల పక్షాన నిలబడి ఉన్నారన్నారు.

Related Posts