YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ప్రియాంక రెడ్డి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.  సహృదయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ప్రియాంక రెడ్డి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.  సహృదయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

 

ప్రియాంక రెడ్డి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.               
సహృదయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
మంత్రాలయం నవంబర్ 30 
డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యకు కారకులైన లారీ డ్రైవర్లను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి  అన్నారు. శనివారం మండల కేంద్రంలో సహృదయ సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా బారీ  ర్యాలీ నిర్వహించారు. ముందుగా వైష్ణవి పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలసి రాఘవేంద్ర సర్కిల్ నుంచి ఎంటీఆర్ సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాఘవేంద్ర సర్కిల్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమిరెడ్డి మాట్లాడుతూ దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్నో  చట్టాలు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం సిగ్గుచేటన్నారు. ప్రతి రోజు ఎక్కడో ఒకచోట కాలేజ్ అమ్మాయిలు మహిళలనే కాకుండా పసిపిల్లలు సైతం   మానభంగాలకు హత్యలకు గురవుతూనే ఉన్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కఠినమైన చట్టాలు వస్తే తప్ప  మహిళలకు రక్షణ ఉండదని అన్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా కార్లు, ఆటో, క్యాబ్లో ప్రయాణం చేసేటప్పుడు డయల్ 100కి సమాచారం ఇస్తే వెంటనే పోలీసు కంట్రోల్ రూం జీపీఎస్ కనెక్ట్ అవుతుందన్నారు. ఇలా అనుసంధానం కావడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కామాంధుల నుంచి రక్షించడం జరుగుతోందని వివరించారు. ప్రియాంక రెడ్డి హత్యకు కారణమైన నిందితులను కఠినంగా ఊరి తీయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సహృదయ సేవ సంస్థ నిర్వాహకులు, మంత్రాలయం వైకాపా నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts