శిశువు దొరికింది
ఖమ్మం నవంబర్ 30
గత ఐదు రోజుల క్రితం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన 16 రోజుల శిశువు ఆచూకీ లభించింది. శనివారం తెల్లవారుజామున శిశువును ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. శిశువు ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్యులు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు. పాపకు చికిత్స నిమిత్తం విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకెళ్లగా అనుమానం వచ్చిన అక్కడి డాక్టర్ లు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడ వెళ్లిన పోలీసులు పాపను ఎత్తుకెళ్లిన నలుగురిని అరెస్ట్ చేసి పాపను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి తల్లి ఒడికి చేర్చారు.