మహిళలపై అత్యాచారాలను ఆపండి
తిరుపతి నవంబర్ 30
దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ, మహిళలను వేధిస్తున్న కామాంధుల ను బహిరంగంగా శిక్షించాలని తిరుపతి ఎస్పిడబ్ల్యూ జూనియర్ కళాశాల ముందు నివాళులర్పించి, నిరసన తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి శశి కుమార్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్ , చలపతి, నగర కార్యదర్శి మునియప్ప, నాయకులు అజయ్, మహేష్, సాయి ,మనోజ్, మంజుల, నదియా, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.