YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మావోయిస్టు నేత సుమిత్రక్క అరెస్టు

మావోయిస్టు నేత సుమిత్రక్క అరెస్టు

మావోయిస్టు నేత సుమిత్రక్క అరెస్టు
 రాయ్ పూర్ నవంబర్ 30 
ఇరవై ఆరు మంది కాంగ్రెస్ నేతలను హత్య చేసిన కేసులో నిందితురాలు, కరుడుగట్టిన మహిళా మావోయిస్టు సుమిత్రా పూనం అలియాస్ సుమిత్రక్కను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.చత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాకు చెందిన సుమిత్ర.. మే 25, 2013న  సుక్మాజిల్లా దర్బా లోయలో కాంగ్రెస్ నాయకులపై దాడిచేసిన పుష్పల్ దళ సభ్యురాలు. ఈ దాడిలో  కాంగ్రెస్ నాయకులు మహేంద్రకర్మ, నందకుమార్ పటేల్, మాజీ ఎమ్మెల్యే ఉదయకుమార్ ముదలియార్లతో పాటు 26 మంది ప్రాణాలు కోల్పోయారు.కాంగ్రెస్ నాయకులపై దాడిలో మొత్తం 39 మంది మావోయిస్టులు పాల్గొన్నారు. వారిలో ఇప్పటికే పదిమందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు ఎన్కౌంటరులో ప్రాణాలు కోల్పోయారు. 27 మంది పరారీలో ఉన్నారు...

Related Posts