YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ పాలనపై టీడీపీ పుస్తకం విడుదల

జగన్ పాలనపై టీడీపీ పుస్తకం విడుదల

జగన్ పాలనపై టీడీపీ పుస్తకం విడుదల
విజయవాడ నవంబర్ 30 
టిడిపి కార్యాలయం లో వైసిపి ప్రభుత్వం ఆరు నెలల పాలనపై పుస్తకాన్ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విడుదల చేసారు. యనమల మాట్లాడుతూ జగన్ అధికారం లోకివచ్విన నాటి నుంచి ప్రతిపక్షాల పై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీ లను అమలు చేయకుండా మోసంచేశారు. వంద రోజుల పాలన తర్వాత అయినా జగన్ తన తీరు మార్చుకోలేదని అన్నారు. ఆరు నెలల జగన్ పాలన పై ఏదో ఘనకార్యం చేసినట్లు తన పత్రికలో రెండు పేజీలు రాసుకున్నారు. ఆరు నెలల జగన్ హింసాయిత పాలన పై పుస్తకం విడుదల చేశాం. రాష్ట్రం లో ఏం జరుగుతుంది  అనేది ప్రజలకు  వివరిస్తాం. రాష్ట్రాన్ని ఎలా ముంచింది.. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్న వైనం, కానరాని  అభివృద్ధి వంటి అంశాలు పుస్తకం లో ప్రచురించామని అన్నారు. జగన్ మంచి సిఎం కాదు.. జనాలను ముంచే సిఎం. ఆరు నెలల్లోనే అరాచక పాలనతో అందరినీ బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఆర్ధిక వ్యవస్థ పటిష్ఠం చేయాలి. జగన్ పాలనలో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. డబ్బు లేకుండా రోజుకో హామీ ఇచ్చు కుంటూ వెళుతున్నారు. రాష్ట్రానికి ఉండే సహజ సంపదను ప్రభుత్వం లో ఉన్న నేతల దోపిడీ కి గురవుతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు.. వైసిపి నేతల జేబుల్లోకి వెళుతుంది. 21వేల కోట్ల రూపాయల ఆర్ధిక లోటు ఉందని అంచనా వేశారు. టిడిపి హయాంలో రెవిన్యూ పెంచినా.. అప్పులు చేయక తప్పలేదని అన్నారు. జగన్ ప్రభుత్వం లో ఏ కార్యక్రమం కూడా పూర్తిగా చేయలేరని అందరికీ అర్ధమవుతుంది. ఏ ప్రభుత్వం అయినా అప్పులు తేవడం సహజం. ఐదేళ్లలో ఆ డబ్బుతో పోలవరం, రాజధాని, వంటి భారీ ప్రాజెక్టు లుచేపట్టాం. ఆర్ధిక పరమైన ఎకానమీ లేకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది. కనీస అవగాహన లేకుండా జగన్ ఎకానమీ పై మాట్లాడతున్నారు. మూడు నుంచి నాలుగు శాతం ఎకానమీ ఇప్పటికే పడిపోయింది. జగన్ ప్రభుత్వం వచ్చాక 48 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తామని బడ్జెట్ లో చెప్పారు. ఇప్పుడు మరో14వేల కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తుంది. వీటిని చూస్తే... ముందు ముందు జగన్ ఏమీ చేయలేరని అర్ధమవుతుంది. ఉద్యోగులు కు జీత భత్యాలు కూడా చెల్లించలేని స్థితికి తెచ్చారు. జగన్ ప్రభుత్వం అవినీతి లో కూరుకుపోయిందని విమర్శించారు. నేను అవినీతి చేయడం లేదంటే ఎవరు నమ్ముతారు. ప్రతి శుక్రవారం కోర్టు కు వేళ్లే నువ్వు అవినీతిని అరికడతావా. ఇసుక అడ్డదారుల్లో రవాణా చేసి దోచుకుంటుంది ఎవరని అడిగారు. ప్రభుత్వ వాహనాల పేరుతో పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారు. భవిష్యత్తు లో కూడా మీరు, మీ వారు,బాగుపడటం తప్ప .. రాష్ట్రం వెనక్కి పోతుంది. రాష్ట్రం లో అనేక రకాల జ్వారాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మీరు పట్టించుకోరు. మీ నాన్న అధికారం లో ఉంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్ లు కట్టావు. చంద్రబాబు కు ఇల్లు లేదంటున్నావు.. ఆయన నీలాగా ప్యాలెస్ లు కట్టలేరు. జగన్ అఫడివిట్ చూస్తే.. అన్ని కంపెనీలలో ఇన్నిషేర్లా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. 43వేల కోట్లు అటాచ్ చేసిన కేసు స్టడీ చేస్తే తెలుస్తుంది. మీ మంత్రులు నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. జగన్ డైరెక్షన్ లోనే ప్రతిపక్షాల ను మంత్రులు తిడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చి ఉంటే  రాజధాని లో  భవనాలు అధికారులకు, ప్రజలకు ఈపాటికి నిర్మాణాలు పూర్తి చేసి  ఇచ్చే వాళ్లమని అన్నారు.  ఆదర్శ వంతమైన రాజధాని నిర్మించాలని చంద్రబాబు పని చేశారు. ఇప్పుడు వచ్చి ఒక్క ఇటుక కూడా వేయలేదని వైసిపి నేతలు మాట్లాడుతున్నారు. జగన్ కు పని చేయాలనే ఆలోచన లేదు.. అందుకే ఆర్థిక స్థితి పట్టించుకోలేదు. నేడు అమ్మ భాష ను కూడా జగన్  వివాదం చేస్తున్నారు. అంబేద్కర్ తెలుగు మాధ్యమంలో చదివినా.. రాజ్యాంగాన్ని రూపొందించలేదు. మేము తెలుగు భాష కూడా  ఉండాలంటే... ఇంగ్లీషు మాధ్యమానికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తారా. ప్రజలంతా వైసిపి కి గుణపాఠం చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. 

Related Posts