YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

స్పందన అర్జీల పరిష్కారంలో జిల్లా  నెంబర్ వన్  డయల్ యువర్ కలెక్టర్ లో అధికారులను అభినందించిన జెసి రవి పట్టన్ షెట్టి

స్పందన అర్జీల పరిష్కారంలో జిల్లా  నెంబర్ వన్  డయల్ యువర్ కలెక్టర్ లో అధికారులను అభినందించిన జెసి రవి పట్టన్ షెట్టి

స్పందన అర్జీల పరిష్కారంలో జిల్లా  నెంబర్ వన్
 డయల్ యువర్ కలెక్టర్ లో అధికారులను అభినందించిన జెసి రవి పట్టన్ షెట్టి
కర్నూలు , నవంబరు 30 
డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమానికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టరు రవి పట్టన్ పెట్టి అధికారులకు సూచించారు . శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనం నుండి జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 . 30 నుండి 10 . 30 గంటల వరకు ఫోన్ ద్వారా ప్రజలనుండి వచ్చిన 29 సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను జెసి ఆదేశించారు . డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమాన్ని అధికారులందరూ సీరియస్ గా తీసుకుని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టాలని జెసి ఆదేశించారు . డయల్ యువర్ కలెక్టరు సమస్యల పరిష్కారంపై చేపట్టిన చర్యలను సంబంధిత ఫిర్యాదుదారులకు వివరించాలని ఆయన అధికారులకు సూచించారు . స్పందన అర్జీల పరిష్కారంలో కర్నూలు జిల్లా  నెంబర్ వన్ రావడంతో డయల్ యువర్ కలెక్టర్ లో జె సి అధికారులను  అభినందించారు. అలాగే సియంఓ ఆఫీసు నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు . స్పందనలో వచ్చిన అర్జీలను చిన్న చిన్న కారణాలతో రిజెక్ట్ చేయకుండా పరిశీలించి అర్టీ దారులతో మాట్లాడి అర్జీదారులకు సత్వర న్యాయం చేయాలన్నారు . వైఎస్ఆర్ నవశకం నాలుగు కార్డుల జారీ సర్వే వివరాలు డేటా ఎంట్రీ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని జిల్లా అధికారులకు జెసి ఆదేశించారు . ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం పూర్తి చేయాలన్నారు . ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సిసి కెమెరాల ఏర్పాటు వినియోగదారులకు క్వాలిటి ఇసుక ఇవ్వాలని మైనింగ్ శాఖ అధికారులను సూచించారు . ప్రభుత్వం ప్రకటించిన ఇసుక రేటు కన్న ఎక్కువ రేటుకు అమ్మినా చర్యలు తీసుకోవాలని సూచించారు . అక్రమ ఇసుక రవాణాకు జిల్లా వ్యాప్తంగా 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేసామని , నిరంతరం నిఘా ఉంచామన్నారు . డిసెంబరు మాసం 4న తేదీ అనంతపురం జిల్లాలో అన్ని శాఖల జిల్లా అధికారులకు స్పందనపై ట్రైనింగ్ ఉంటుందని ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు . జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డేటా వివరాలు వెంటనే ఇవ్వాలని జెసి జిల్లా అధికారులను ఆదేశించారు . జెసి - 2 సయ్యద్ ఖాజామోహిద్దీన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రమయోగి పెన్షన్ స్కీమ్ కింద అసంఘటిత కార్మికులకు పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని డిసెంబరు 6 వరకు అవగాహనా కార్యక్రమం నిర్వహించి , అసంఘటిత కార్మికుల వివరాలు నమోదు చేయాలన్నారు . 18 నుంచి 40 సంవత్సరాల వయసున్న వారు ఈ పథకానికి అర్హులని , నెలకు రూ 50 / - ల చొప్పున చెల్లించాలన్నారు . 60 సంవత్సరాలు నిండిన తరువాత పెన్షన్ ద్వారా రూ . 3000 / - లను ప్రభుత్వం అందజేస్తుందన్నారు . నెలవారి ఆదాయం రూ . 15000 / - ల లోపు ఉన్నవారందరూ అర్హులన్నారు . రిక్షా . . . తొక్కేవారు , వీధులు ఊడ్చేవారు , ఇటుకలు తయారు చేసేవారు , నిర్మాణ రంగంలోని కూలీలు , బీడీ కార్మికులు , చేనేత కార్మికులు , తోలు కార్మికులు ఇలా అసంఘటిత రంగంలోని ఎవరైనా పియంఎస్ వైఎం స్కీమ్ కు అర్హులన్నారు . ఈ పెన్షన్ సదుపాయంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు . పెన్షన్ పథకం అవగాహనా కార్యక్రమాలు వారం రోజులపాటు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ పరిశీలిస్తుందన్నారు . ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ పుల్లయ్య , జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు .
 

Related Posts