YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఉరి తీయాల్సిందే.. సర్వత్రా ఇదే డిమాండ్!   షాద్ నగర్ పోలీసు స్టేషను ముందు ప్రజల ఆందోళన 

ఉరి తీయాల్సిందే.. సర్వత్రా ఇదే డిమాండ్!   షాద్ నగర్ పోలీసు స్టేషను ముందు ప్రజల ఆందోళన 

ఉరి తీయాల్సిందే.. సర్వత్రా ఇదే డిమాండ్! 
 షాద్ నగర్ పోలీసు స్టేషను ముందు ప్రజల ఆందోళన 
షాద్ నగర్ నవంబరు 30 
వైద్యురాలి హత్య ఘటనపై షాద్నగర్ అట్టుడికిపోతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఉరితీయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినపడుతోంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు, ప్రజా సంఘాలు, స్థానికులు నిరసనకు దిగారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు హత్యాచార ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని మహిళా, ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను ఉరితియ్యాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. ఇదిలా ఉంటే నిందితులకు న్యాయసహాయం చేయబోమని జిల్లా బార్ కౌన్సిల్ ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని తెలిపింది. వైద్యురాలిని పక్కా స్కెచ్తోనే నిందితులు హత్య చేశారని పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో నలుగురు యువకులు ఈ ఘోరానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ కిరాతకానికి సంబంధించి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్కు చెందిన లారీ డ్రైవర్ మహ్మద్ ఆరిఫ్ (26), లారీ క్లీనర్ శివ (20); అదే మండలం గుడిగండ్లకు చెందిన లారీ క్లీనర్ నవీన్ (23); మరో క్లీనర్ చింతకుంట చెన్నకేశవులు (20) నిందితులని తెలిపారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ శుక్రవారం శంషాబాద్ లో  జరిగిన విలేఖరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు

Related Posts