YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

నీళ్ల దందా (నెల్లూరు)

నీళ్ల దందా (నెల్లూరు)

నీళ్ల దందా (నెల్లూరు)
నెల్లూరు, నవంబర్ 30 జిల్లాలో శుభ్రత లేని నీళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కనీస అనుమతులు కూడా లేకుండా ప్లాంట్లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. చిన్న గదిని అద్దెకు తీసుకుని పక్కనే బోరువేసి ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. బోర్లకు మోటారు బిగించి నీటిని శుద్ధి చేసే సాధారణ ఫిల్టర్‌ ఉండే స్టీల్‌ ట్యాంకును బిగిస్తున్నారు. ప్లాస్టిక్‌ పైపుద్వారా నీరు క్యాన్లకు నింపుతున్నారు. ఫిల్టరు దెబ్బతిన్నా అందులో నుంచే నీటిని క్యాన్లకు వినియోగిస్తున్నారు. కేవలం రూ.2.50 లక్షల ఖర్చుతో ప్లాంటును ఏర్పాటు చేసి క్యానుకు రూ.10లు నుంచి రూ.20లు వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క ప్లాంటు నుంచి ప్రతి రోజూ 500లకు పైగా క్యాన్ల నీటిని విక్రయిస్తున్నారు. వాటర్‌ ప్లాంటు పక్కన చెత్తాచెదారం, అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది. అన్నీ తెలిసిన జిల్లా అధికారులు కూడా  ప్లాంట్ల పనితీరును తెలుసుకోవడం లేదు. నగర,పురపాలక సంఘాల, కల్తీ ఆహార నియంత్రణశాఖ అధికారులు  దాడులు చేయడం లేదు.  ్య మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ప్రతి మేజర్‌ పంచాయతీలోనూ ఉన్నాయి. నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరిలో ఎక్కువగా ఉన్నాయి. నగరంలో 100కు పైగా ఉన్నాయి. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకోవాలంటే సుమారు రూ.5లక్షల వ్యయమవుతుంది. ఏటా పునరుద్ధరించుకోవాలి. సంస్థ నిపుణులు వచ్చి నీటి నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్ష చేయిస్తారు. ఆ తర్వాతే ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఈ ప్రక్రియంతా వ్యయ ప్రయాసలతో కూడినది కావడంతో 98 శాతం మంది అనుమతులు లేకుండానే ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. పది సంవత్సరాలుగా నడుస్తున్న పెద్ద ఆర్వో ప్లాంట్లకు సైతం అనుమతులు లేవు. కుళాయి నీటినే వాటర్‌ ప్యాకెట్లుగా మారుస్తున్నారు. వాటర్‌ ప్యాకెట్లు తయారు చేయడం ప్రత్యేక పరిశ్రమగా మార్చారు. నీటిని పరీక్షించేందుకు ల్యాబ్‌లు ఉండవు.  బీఐఎస్‌ గుర్తింపుతో రిజిస్ట్రేషన్‌ పొందిన వాటిని మాత్రమే ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తారు. బబుల్స్‌ రూపంలో విక్రయించే వాటిపై వారి పర్యవేక్షణ ఉండదు. అలాంటి వాటిని పరిశీలించాల్సిన బాధ్యత రెవిన్యూ, మున్సిపల్‌ యంత్రాంగానిది. పట్టణాల్లో కమిషర్లు , గ్రామాల్లో తహసీల్దారు, ఆర్డీవోలు తనిఖీలు చేసి ఆరోగ్య ప్రమాణాల మేరకు నీరు లేకపోతే చర్యలు తీసుకోవచ్చు. జిల్లాలో ఎక్కడా.. ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తగిన ప్రమాణాలు పాటించకుండా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లలో తయారు చేసిన నీటిని తాగడం వల్ల దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి. బబుల్స్‌లో నీటిని నింపే ముందు స్టెరిలైజ్‌ చేయాలి. అలా చేసినప్పుడు అందులోని హానికర సూక్ష్మజీవులు పోతాయి. ఎక్కడా అలా చేసిన దాఖలాలు లేవు. సరిగా శుభ్రం చేయకుండా నీరు నింపడం వల్ల పాచిపట్టి ఫంగస్‌ చేరుతుంది. సురక్షితం కాని నీటిని తాగడంతో టైఫాయిడ్, డయేరియా, అతిసారం లాంటివి సోకుతున్నాయి.

Related Posts