ప్రియాంక నిందితులకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్ నవంబర్ 30
షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో తహసీల్దారు పాండు నాయక్ ఎదుట ప్రియాంక హత్యకేసు నిందితులను పోలీసులు హాజరుపరిచారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వెనక దారి నుంచి మెజిస్ట్రేట్‌ను పోలీసులు స్టేషన్‌కు రప్పించారు. పీఎస్‌లోనే మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నిందితులను విచారించారు. నిందితులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. హంతకులను మహబూబ్‌నగర్ జైలుకు తరలించనున్నారు. అంతకుముందు నిందితులకు స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ బయట తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. సంయమనంగా ఉండాలని విజ్ఞప్తి చేసినా నిరసనకారులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు షాద్‌నగర్‌కు చేరుకున్నారు. పోలీసులపైకి చెప్పులు విసరడం, పీఎస్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.