YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కలిసికట్టుగా నడుద్దాం 

కలిసికట్టుగా నడుద్దాం 

కలిసికట్టుగా నడుద్దాం 
విజయవాడ నవంబర్ 30 
టీడీపీ గ్రామ కమిటీల ఏర్పాటుపై టిడిపి నేతలతో ఆ పార్టీ అధినేతల చంద్రబాబు నాయుడు శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ క్షేత్ర స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం మెండుగా ఉంది. జిల్లా పర్యటనల్లో వాళ్ల ఉత్సాహం ప్రత్యక్షంగా చూశాం. ర్యకర్తల్లో పట్టుదల మరింత పెరిగింది. వాళ్ల ఉత్సాహమే పార్టీకి ఎనలేని బలం.  ప్రతి జిల్లాకు 3రోజులు, ప్రతి నియోజకవర్గంతో 2గంటల సమీక్షలు ఫలప్రదం అయ్యాయని అన్నారు. పార్టీ పటిష్టతపైనే అందరూ దృష్టి కేంద్రీకరించాలి.  వైసిపి ప్రభుత్వం 6నెలల్లో అన్నీ వైఫల్యాలే. పేదలు, సామాన్య ప్రజలకు ఎన్నోరకాల బాధలు. 6నెలల్లోనే జనాన్ని ఇన్ని కష్టాలు పెట్టడం చూడలేదు. వైసిపి చేతగానితనంతో రాష్ట్రానికి ఎనలేని కీడు చేశారు. రైతులు, యువత,మహిళల ఆశలను నీరుగార్చారు. ఇన్ని ఆత్మహత్యలు, ఆత్మహత్యా యత్నాలు గతంలో లేవు. ఇసుక కొరతతో 60మంది ఆత్మహత్యలు దేశంలో ఇదే తొలిసారి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. మద్యం ధరలను 150%-200% పెంచారు. దళారుల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారు. పెట్టుబడులన్నీ రాష్ట్రం నుంచి వెనక్కి పోయాయి. యువత ఉపాధి అవకాశాలకు గండి పడింది.  ఆర్ధిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని నెట్టారు. అధికార పార్టీ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలి. వీటన్నింటిపై గ్రామాల్లో,వార్డులలో చర్చలు చేయాలి.  పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రతి శుక్రవారం సమీక్ష. సమర్ధవంతమైన గ్రామ కమిటీలు ఏర్పడాలి. పంచాయితీ ఎన్నికల్లోపు కమిటీలన్నీ ఏర్పడాలని అన్నారు. 159నియోజకవర్గాల్లో షెడ్యూల్ ఇచ్చారు. మిగిలిన చోట్ల కూడా షెడ్యూల్ ఇవ్వాలి. అన్నిప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించాలి. ఇప్పటిదాకా 62% మాత్రమే సమావేశాలు జరిగాయి. మిగిలిన చోట్ల కూడా వెంటనే జరపాలి.గ్రామ,మండల స్థాయిలో రైతు,యువత,మహిళా కమిటీల ఏర్పాటు. ప్రతి నియోజకవర్గంలో 13 అనుబంధ సంఘాల కమిటిలు. 35ఏళ్లలోపు యువతకే  33% పదవులు ఇవ్వాలి. మహిళలకు పార్టీలో మూడోవంతు పదవులు. బిసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలకే 50% పదవులని అయన అన్నారు.ప్రజలంతా పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు. పార్టీ నాయకత్వమే మరింత సంసిద్దం కావాలి. సమర్ధ నాయకత్వంతో పార్టీ ముందడుగు వేయాలి. పార్టీ సమాఖ్యలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.  వ్యక్తిగత పనితీరుతో ఫలితాలు అంతంతమాత్రమే. సమాఖ్య ద్వారా పనిచేస్తే ప్రజల్లో మరింత ప్రభావితం. నాయకులు, కార్యకర్తలు అంతా కలిసికట్టుగా నడవాలని సూచించారు.

Related Posts