YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హస్తినలో ఏం జరుగుతోంది... ఎంపీల కదలికలపై ఆరా 

హస్తినలో ఏం జరుగుతోంది... ఎంపీల కదలికలపై ఆరా 

హస్తినలో ఏం జరుగుతోంది...
ఎంపీల కదలికలపై ఆరా 
విజయవాడ, డిసెంబర్ 2
జగన్ ఓ వైపు అమరావతిలో నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. ప్రతీ రోజూ సమీక్షలు, సమావేశాలు ఇలా జగన్ తీరిక లేకుండానే ఉన్నారు. కొత్త ప్రభుత్వం, పాలన గాడిలో పెట్టాలి. అదే సమయంలో ఆర్ధికంగా ఇబ్బందులో రాష్ట్రం ఉంది. దాంతో నిధుల విషయం కూడా చూసుకుంటూ ముందుకు సాగాలి. ఇంకోవైపు తెర ముందూ వెనకా చేతులు కలిపిన ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవాలి. ఇక పార్టీని రిఛార్జ్ చేయాలి. దిశానిర్దేశం చేయాలి. ఇలా ఒక్క జగన్ ఎన్నో పనులు చేయాలి. ఇవన్నీ చూసుకుంటూనే ఇపుడు జగన్ ఇంకో పని కూడా చేస్తున్నారుట. అది కూడా ఆయన రాజకీయానికి అవసరం కాబట్టే ఆలా చేస్తున్నారుట. జగన్ చూపు ఇపుడు ఢిల్లీ మీద ఉందిటజగన్ గత నెలలో ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని మాత్రమే కలసి వచ్చేశారు. అమిత్ షాను కలవడానికే జగన్ కి రెండు రోజుల సమయం పట్టింది. ఒక ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా సాధారణ ఎంపీని చేరదీసిన అమిత్ షా రాజకీయాన్ని కళ్ళారా చూసిన జగన్ ఇతర కేంద్ర మంత్రులను సైతం కలవకుండా వెంటనే అమరావతి తిరిగి వచ్చేశారు. ఇప్పటికి మళ్ళీ జగన్ ఢిల్లీ వెళ్ళలేదు. ఇదిలా ఉండగా ఢిల్లీలో ఏం జరుగుతోంది. రాజకీయ పరిణామాలు ఏంటన్నది కూడా జగన్ ఎప్పటికపుడు సమాచారం తెప్పించుకుంటున్నారని భోగట్టా. ఢిల్లీ సమాచారం పూసగుచ్చినట్లుగా చెప్పేందుకు నమ్మకస్తుడైన ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ కి ఉన్నారు. ఢిల్లీకి ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇక టీడీపీ ఎంపీలు పార్లమెంట్ సందర్భంగా ఢిల్లీలో మకాం వేశారు, వారు ఎవరిని కలిశారు, ఏమేం మాట్లాడుతున్నారు. సీఎం రమేష్ కుమారుడి వివాహ నిశ్చితార్ధం వేళ దుబాయిలో ఏం జరిగింది, ఇలా చాలా విషయాలనే జగన్ తెప్పించుకుని మదింపు చేసుకుంటున్నారు.ఇక ఏపీలో అన్ని పార్టీల మీద విమర్శలు చేయిస్తున్న జగన్ బీజేపీ విషయంలో మాత్రం తొందర పడవద్దని క్యాడర్ కి అదేశాలు జారీ చేసినట్లుగా కూడా చెబుతున్న్నారు. జగన్ బీజేపీ విషయంలో ఇప్పటికైతే ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు. రాజకీయంగా బీజేపీలో పేచీలు వద్దు అన్నదే జగన్ విధానంగా కూడా ఉందని చెబుతుననరు. బీజేపీతో విభేధించి చంద్రబాబు ఏం సాధించారన్నది కూడా జగన్ కి కళ్ళముందు ఉంది. పైగా ఏపీ నష్టపోయిన రాష్ట్రం, అందువల్ల మంచిగా ఉంటూనే కొంత సాయమైనా తెచ్చుకోవాలన్నది జగన్ ఆలోచన అంటున్నారు. అయితే పరిస్థితుల్లో మార్పులు వస్తే మాత్రం తాను చేయగలింది కూడా ఏమీ లేదని జగన్ కి తెలుసు. తన వైపు నుంచి ప్రతికూల వాతావరణం లేకుండా మాత్రమే జగన్ చూసుకుంటున్నారు. అయితే కేంద్ర పెద్దల ఆలోచనల్లో మార్పు వచ్చినా ఏం చేయాలన్న దాని మీద జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. సాధ్యమైనంతవరకూ మైత్రి బాటలోనే నడవాలని జగన్ ఆలోచన‌గా ఉందని అంటున్నారు. ఇదీ ఇప్పటికైతే ఢిల్లీ మీద జగన్ ఫోకస్ గా కనిపిస్తోంది.

Related Posts