వామ్మో..బీసీ హాస్టల్
తిరుపతి,
పట్టణంలో ప్రభుత్వ బార్సు బీసీ హాస్టల్ సుమారు 40 సంవత్సరాలకు ముందు నిర్మించబడింది. ఇక్కడ హాస్టల్ ఉన్నందువలన చుట్టుపక్కల విద్యార్థులు హాస్టల్లో ఉంటూ చదువుకోవడానికి ఎంతో సహాయకరంగా ఉంటుంది. విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లడానికి ఇది ఒక పునాది లాంటిది. ఇక్కడ స్థానిక విద్యార్థులు, చుట్టుపక్కల విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకోవడానికి అన్ని విధాలా సౌకర్యాలు ఉండేది. కానీ అది రానురాను దిగజారి పోయింది.బిసి హాస్టల్‌లో ఒకప్పుడు స్కూలు నుంచి హాస్టల్‌కు రాగానే మొదటగా ఆ రోజు స్కూల్‌లో చెప్పిన సబ్జెక్ట్ పైన స్టడీ అవర్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ అది లేకుండా విద్యార్థులు బయట ప్రయివేటు ట్యూషన్‌కు వెళ్లి ఫీజులు కట్టి చదువుకోవాల్సిన పరిస్థితి. సాయంత్రం స్కూలు నుంచి రాగానే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు ఉండదని వాపోతున్నారు. సాయంత్ర సమయంలో బయట ట్యూషన్‌కు వెళుతున్నామని, ప్రయివేటు ట్యూషన్‌కు డబ్బులు కట్టాలటే ఇంటి నుంచి పంపించాలని, తమకు ఫీజులు కట్టలేకుండా మా తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. మాకు స్టడీ అవర్ ఇక్కడే కల్పిస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు.ట్యూషన్‌కు వెళ్లి హాస్టల్‌కు వస్తే లైట్స్ ఉండవు. స్విచ్ బోర్డులు పగిలి కిందకు వేలాడుతున్నాయి. వెలుతురు లేనప్పుడు దానికి తగిలి కరెంట్ షాకుకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హస్టల్‌లో విద్యార్థులు 52 మంది ఉంటారు. ఉదయాన్నే లేవగానే బాత్ రూంకు వెళ్లాలంటే నీళ్లు ఉండవు. ఆ సమయంలో బయటకు వెళ్ళాలంటే విష పురుగులు కరుస్తుందని భయంగా ఉందని ఆందోళన చెందుతున్నారు. వంటలో నాణ్యత ఉండడంలేదని, దోమల నుంచి తమకు రక్షణ లేకుండా అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
============================