YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మొద్దు నిద్రలో పోలీస్ శాఖ

మొద్దు నిద్రలో పోలీస్ శాఖ

మొద్దు నిద్రలో పోలీస్ శాఖ
మెదక్, 
డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణ హత్యో దాంతం మరోసారి పోలీసు వ్యవస్థ పని తీరులో డొల్లతనాన్ని బయటపెట్టింది. దేశంలోనే అత్యుత్త మ పోలీసు వ్యవస్థగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఆరి తేరిన వ్యవస్థగా చెప్పుకుంటూ వచ్చిన రాష్ట్ర ఏలికలకు సైతం తొండుపల్లి టోల్‌గేట్‌ సమీపంలో చోటు చేసుకున్న ఘోరకృ త్యంపై నోరుమెదపలేని పరిస్థితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా తల్లిదండ్రులు, మహిళల ఆందోళన లకు దారి తీసిన ఈ ఘోరాన్ని నివారించడంలో పోలీసులు ఎందుకు, ఎక్కడ వైఫల్యం చెందారనే అంతర్గత మథనంలో సర్కారు పడిందని తెలుస్తోంది. కొన్ని సాంకేతిక కారణాలను ఈ ఘటన చోటు చేసుకోవడానికి కారణాలుగా బయటికి చెప్పకుంటున్నప్పటికీ ప్రజలు, మేధావులు, ప్రజాసం ఘాలు, విపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు తగిన సమాధానం ఇవ్వలేని స్థితిలో పడిపోయారని తెలుస్తోంది. అయితే పోలీసు శాఖలో గతంలో ఒక వెలుగు వెలిగిన కొందరు మాజీ ఐపీఎస్‌లు మాత్రం రాష్ట్ర పోలీసులు బేసిక్‌ పోలీసింగ్‌, విజిబుల్‌ పోలీసింగ్‌ను మరచి పోవడమే జరుగుతున్న దారుణాలకు కారణంగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసింగ్‌ పూర్తిగా సీసీ కెమెరా లపైనే ఆధారపడి నడుస్తున్నదని, గస్తీ తిరగాల్సిన వేళ తిరగకుండా ఏదైనా జరిగితే సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరించవ్చనే భరోసాలోనే ఎక్కువగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆధారపడి నడుస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. గతంలో రోజు వారి విధుల అనంతరం ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి 12.00 గంటల వరకు ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో కీలకమైన రోడ్డులో నిలబడి వాహనాలను సోదా చేసే వారు. దీని వలన సంఘవిద్రోహ శక్తులు, అవాంఛనీయ శక్తులు తాము ఏదేని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే స్థితిని ఈ సోదాలు బట్టబయలు చేసేవి. వారి వద్ద కత్తులు, కటార్లు, ఇతర మారణాయుధాలు, పేలుడు పదార్థాలు ఏవి ఉన్న ఈ ఆపరేషన్‌లో పట్టుబడేవి. అలాగే గంజాయి మొదలైన మాదకపదార్థాల అక్రమరవాణా, బంగారం స్మగ్లింగ్‌, గుడుంబా రవాణాలకు అడ్డుకట్ట పడేది. మరో వైపు పోలీసులు అలర్ట్‌ ఉండటం, రోడ్లపై విరివిగా కనిపించడం వలన ఏదేని నేరానికి పాల్పడే ప్లాన్‌తో వచ్చే నిందితులు తోక జాడించే వారు. ఇలా ప్రతి రోజు పోలీసులు ఫ్రిస్కింగ్‌ చేయడంతో పాటు ఒక్కో మారు హఠాత్తుగా పగటివేళలోనే పోలీసులంతా రోడ్లపైకి వచ్చి సోదాలను నిర్వహించడం వలన చిన్న పాటి నేరస్తులు మొదలుకుని కరడుగట్టిన ఉగ్రవాదుల వరకు పట్టుబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ చర్య వలన ప్రివెన్షన్‌ బెటర్‌దెన్‌క్యూర్‌ అనే పోలీసు మౌలిక సూత్రాన్ని సక్రమంగా పాటించిన వారయ్యేవారు. కాని రాను రాను ఈ విధానానికి తిలోదకాలు ఇవ్వడం, సీసీ కెమెరాలపనే ఆధారపడి నడిచే వ్యవస్థగా మార్పులు తీసుకు రావడం వలన క్రింది స్థాయి అధికారులు, సిబ్బందిలోను ఒక రకమైన అలసత్వం ఏర్పడిందనే అభిప్రాయాన్ని రాష్ట్ర డీజీపీగా పని చేసిన ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అన్నారు. అప్పటి కంటే ఇప్పుడు రాష్ట్ర పోలీసు శాఖకు మూడున్నరవేలకు పైగా కొత్త వాహనాలు ఉన్నాయి, పోలీసు స్టేషన్‌ అవసరాలు తీర్చడానికి రూ.70 వేల రూపాయలు నిర్వాహణ ఖర్చుల కింద ఇస్తున్నారు, ఇతర విభాగాల కంటే పోలీసు శాఖలోని ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నారు. అలాంటప్పుడు పరిసరాలపై నిఘా వేయడంలో, నేరాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించిన ప్రాంతాలలో కన్నేసి ఉంచడంలో, ఆ ప్రాంతాలలో విరివిగా పెట్రోలింగ్‌ నిర్వహించడంలో ఎందుకు స్థానిక పోలీసులు విఫలం చెందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా వరకు రాత్రి వేళ బస్తీలు, కాలనీలు, గ్రామాలలో సైతం బీట్‌ కానిస్టేబుట్‌ తిరిగి బీట్‌ పుస్తకాలలో సంతకాలు పెట్టడం, స్థానికులను అప్రమత్తం చేయడం వంటి విధులు కూడా కుంటినడక నడుస్తున్నాయని పలు ప్రాంతాల ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్‌ చేస్తేనే వస్తాము అనే ధోరణి ఎక్కువగా ప్రబలిందని, అలాగే ఎవరైనా తమ వద్ద పలానా నేరం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళితే మీ వద్ద సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకోలేదంటు పోలీసు అధికారులు దబాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలు, యవతుల కనిపించడడం లేదంటు బాధితులు స్టేషన్‌కు వెళితే చాలా వరకు స్టేషన్‌లలో ఎవరితోనైనా లేచి పోయిండొచ్చు, లేదా లవర్‌తో ఉండొచ్చు అంటు అసభ్యకరవ్యాఖ్యలు వస్తున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పెట్రోలింగ్‌ చేసే పోలీసు బృందాలలో చాలా వరకు ప్రధాన రోడ్లలో తిరిగి ఎక్కడో చోట వాహనం ఆపుకుని నిలుచుని పోతున్నారని తెలుస్తోంది. ఇందుకు వారికి తగినంత ఇంధనం ఇవ్వక పోవడం ఒక కారణంకాగా మరో వైపు చిన్న చిన్న సందులలో ఆ వాహనాలువెళ్లే అవకాశం లేక పోవడంతో ఆ సిబ్బందిలోని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే డాక్టర్‌ ప్రియాంక హత్యోదాంతం జరిగిన తొండుపల్లి టోల్‌గేట్‌ సమీపంలో రాత్రి వేళ పెద్ద సంఖ్యలో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన లారీలు ఆగుతాయి. వివిధ సరుకుల లోడ్‌లతో ఉన్న ఈ లారీలు నిబంధనల ప్రకారం రాత్రి పది గంటల తర్వాతే సిటీలోకి వెళ్లాలి. సాయంత్రం నుంచి రాత్రి పది వరకు ఆగే ఈ లారీలలో చట్టవ్యతిరేక సరుకులు, ఇతర లోడ్‌లు ఉన్నాయా అనేది చెక్‌ చేయడం స్థానిక పోలీసుల విధుల్లో భాగం. ఏది ఏమైనప్పటికీ ప్రివెన్షన్‌ బెటర్‌ దెన్‌ క్యూర్‌ అనే విధానాన్ని విశ్వసించే పోలీసు ఉన్నతాధికారులకు విజిబుల్‌ పోలీసింగ్‌, బేసిక్‌ పోలీసింగ్‌ విధానాన్ని అనుసరించడం అత్యంత ఆవశ్యకమైందని కొందరు మాజీ డీజీపీలు సూచిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేచేయడమే కాదు, వాటిని నేరం జరిగిన తర్వాత కేవలం ఆధారాల కోసమే ఉపయోగించడం సరికాదని వారంటున్నారు.
సంగారెడ్డి జిల్లా ఇంద్రకరణ్‌లో టెక్స్‌టైల్స్, బూచినెల్లిలో వంట నూనెల పరిశ్రమలు, వికారాబాద్ జిల్లా రాకంచర్లలోని స్టీల్ రోలింగ్ పరిశ్రమలను తరలించేందుకు టిఎస్‌ఐఐసి ఆయా పార్కుల్లో సౌకర్యాలను అభివృద్ధి చేస్తోంది. అయినా రెడ్, ఆరెంజ్ కేటగిరీకి చెందిన పరిశ్రమలు అక్కడకు వెళ్లడానికి ఆసక్తి చూపకపోవడంతో టిఎస్‌ఐఐసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై పిసిబి, టిఎస్‌ఐఐసి సంస్థలు ప్రభుత్వానికి దీనిపై నివేదించినట్టుగా తెలిసింది

Related Posts