YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహిళల రక్షణకు టోల్‌ ఫ్రీ నంబర్లు  

మహిళల రక్షణకు టోల్‌ ఫ్రీ నంబర్లు  

మహిళల రక్షణకు టోల్‌ ఫ్రీ నంబర్లు  
అమరావతి 
ఆపదలో ఉన్న మహిళలు తక్షణ సహాయం కోసం తమను సంప్రదించాల్సిన నంబర్లను డీజీపీ కార్యాలయం మరోసారి ప్రకటించింది.   

- 100కు ఫోన్‌ చేస్తే కాల్‌ సెంటర్‌లోని సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసుకొని, వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇస్తారు. వారి నుండి తక్షణమే సహాయం పొందవచ్చు. 
- 112కు ఫోన్‌ చేస్తే బాధితులు ఉన్న లొకేషన్‌తో పాటు కాల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో చిరునామా కూడా తెలుస్తుంది. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని బాధితులకు రక్షణ కల్పిస్తారు. 
- 181కు ఫోన్‌ చేస్తే రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌ కాల్‌ సెంటర్‌కు వెళ్తుంది. మహిళలు తమ సమస్యను చెబితే పోలీసులకు సమాచారం పంపి వెంటనే అప్రమత్తం చేస్తారు.  
- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మహిళల రక్షణ కోసం పోలీసులు ‘సైబర్‌–మహిళామిత్ర’ వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేశారు.  వాట్సాప్‌ నంబర్‌ 9121211100 అందుబాటులో ఉంచారు. ఈ నంబరుకు వాట్సాప్‌ చేస్తే, బాధితులు ఉన్న ప్రదేశానికి పోలీసులు వెంటనే చేరుకుంటారు. రక్షణ కల్పిస్తారు. 

Related Posts