రాజ్యసభ లో షాద్‌నగర్ నిర్భయ ఘటనఫై ... తీవ్రంగా ఉద్వేగానికి లోనైన ఉపరాష్ట్రపతి వెంకయ్య
దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళలపై దాడులు చేయడం ఒక సామాజిక రోగంగా మారపోయిందన్నారు. పోలీస్ వ్యవస్థలో కూడా చాలా పాలున్నాయన్నారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే... తమ పరిధి కాదని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేవలం కోర్టులు, చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదన్నారు. ఈ పరిస్థితిపై మార్పు రావడానికి సమాజం అంతా కృషి చేయాలన్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు సత్వరమే న్యాయం లభించాలన్నారు వెంకయ్య నాయుడు. పిల్లల్లో నైతిక విలువల్ని తల్లిదండ్రులు పొందించాలన్నారు. సామాజిక చైతన్యంతోనే నేరాలకు అడ్డుకట్ట డుతుందన్నారు.అంతకుముందు రాజ్యసభలో చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మహిళా ఎంపీలు ఈ ఘటనపై మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి... నిందితులకు కఠిన శిక్ష అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.