నేటి అర్థరాత్రి నుంచి బస్సు ఛార్జీలు పెరగనున్నాయి.
ఇకపై తెలంగాణలోని ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది. సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లోనూ కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది. సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 15 పెంచారు. డీలక్స్ కనీస ఛార్జీ రూ. 15 నుంచి రూ. 20 పెరగనుంది. సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ రూ. 25 పెంచారు. ఇకపై రాజధాని, వజ్ర బస్సులో కనీస ఛార్జీ రూ. 35 పెరగనుంది. గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీలో కనీస ఛార్జీ రూ. 35 పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస ఛార్జీ రూ. 75 పెంచారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్ పాస్ ధరలు కూడా పెరగనున్నాయి. ఆర్డీనరీ బస్ ధర రూ. 950, ఎక్స్‌ప్రెస్ రూ. 1070, డీలక్స్ రూ. 1185గా ఉండనుంది.