తల్లిని కడతేర్చిన తాగుబోతు
షాద్ నగర్
కన్న తల్లిని హత్య చేసిన తనయుడు తాగిన మత్తులో డబ్బుల కోసం దారుణం ఫారూఖ్ నగర్ మండలం కంసన్ పల్లి గ్రామంలో జరిగింది. తాగిన మత్తులో డ బ్బుల కోసం ఓ తనయుడు తల్లిని దారుణంగా హత్య చేశాడు.
రంగారెడ్డి జిల్లా ఫారూఖ్ నగర్ మండలం కంసన్ పల్లి గ్రామంలో ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింలు తాగుడుకు బానిసై పని పాటా లేకుండా తిరుగుతున్నాడు.గతంలో భార్య పైన కూడా దాడి చేసి జైలుకు వెళ్ళాడు.ఆదివారం కూడా తప్పతాగి ఇంటికి వచ్చి డబ్బులు కావాలంటూ తల్లితో గొడవ పడ్డాడు దీనికి ఆమె నిరాకరించడంతో రోకలి బండతో తల పై మోదీ హతమార్చాడు.తలపై బలమైన గాయంతో ఆమె అక్కడే మరణించింది సంఘటన స్థలానికి అర్థరాత్రి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.