YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

నిషేధంతో నీలినీడలు (శ్రీకాకుళం)

నిషేధంతో నీలినీడలు (శ్రీకాకుళం)

నిషేధంతో నీలినీడలు (శ్రీకాకుళం)
శ్రీకాకుళం, : దశాబ్దాలుగా వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ జిల్లాలో కీలక పరిశ్రమగా ఉన్న యునైటెడ్‌ బేవరేజస్‌ సంస్థ మనుగడపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా ఇప్పటికే పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రభావం బీర్లు ఉత్పత్తి చేసే పరిశ్రమపై స్పష్టంగా కనిపిస్తోంది. రూ. వందల కోట్లతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ప్రస్తుతం దాదాపు ఖాళీగా ఉంటున్నారు. కంపెనీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బీర్లు సరఫరా చేసే పరిశ్రమలు నాలుగు ఉన్నా రణస్థలం సమీపంలోని బంటుపల్లి వద్ద ఉన్న యూబీ పరిశ్రమే ప్రధాన సరఫరాదారు. మిగతావి తక్కువ సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రభుత్వం మద్యం విక్రయాలను క్రమేపీ తగ్గించుకుంటూ వెళ్తోంది. ఫలితంగా ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి దాదాపు స్తంభించింది. గతంలో గిరాకీ సమయంలో నెలకు 12 లక్షల కేసులు ఇక్కడ ఉత్పత్తి చేసేవారు. గిరాకీలేని సమయంలో కూడా నెలకు 9 నుంచి 10 లక్షల కేసులు ఉత్పత్తి చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు నుంచి నెలకు కనీసం లక్ష కేసులు కూడా ఉత్పత్తి చేయడం లేదు.
గతంలో ప్రభుత్వం నుంచి ప్రతి నెలా దాదాపు 11 లక్షల కేసులు ఉత్పత్తి చేయాలని ఆర్డర్లు వచ్చేవి. నవంబరులో 60 వేల కేసులకు కూడా ఆర్డరు ఇవ్వలేదు’ అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో అక్కడ బీర్లు విక్రయించేందుకు తగిన పరిస్థితులు లేవు. బీర్లు నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ప్రభుత్వం నుంచి దాదాపు ఆర్డర్లు నిలిచిపోయాయి. ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 750 మంది ఉద్యోగులు, కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా సీసాలు, అట్టలు, సీసాల మూతలు, లేబుళ్లు తయారు చేసే వారు, మాల్ట్‌, బియ్యం, పంచదార, జర్మనీ నుంచి రప్పించే మరికొన్ని పదార్థాలు విక్రయించేవారు.. అలాగే రవాణా రంగంలో పరోక్షంగా మరో మూడు వేల మంది ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం సిబ్బంది పరిస్థితి అయోమయంగా ఉంది. ఇప్పటికే మూడు నెలల నుంచి ఉత్పత్తులు ఆశాజనకంగా లేకున్నా జీతాలు చెల్లిస్తున్నారు. ఆర్డర్లు మరింత క్షీణిస్తుండడంతో ఏం చేయాలో పాలు పోని పరిస్థితి.

Related Posts