YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

నిధులు లేక.. నీళ్లు రాక (నెల్లూరు)

నిధులు లేక.. నీళ్లు రాక (నెల్లూరు)

నిధులు లేక.. నీళ్లు రాక (నెల్లూరు)
నెల్లూరు, : ఫ్లోరైడ్‌ నీళ్లు తాగుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు గుక్కెడు సురక్షిత నీటి అందించి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఉదయగిరి మండలం గండిపాళెం జలాశయం వద్ద ఏర్పాటుచేసిన సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు చతికిలపడింది. అధికారుల పర్యవేక్షణలేక...చిన్నచిన్న మరమ్మతులకు నిధులురాక చాలీచాలని నీళ్లు సరఫరా చేస్తూ ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి నెలకొంది. ఉదయగిరితో పాటు చుట్టు పక్కల అయిదు మండలాల్లో ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసేందుకు గండిపాళెం జలాశయం వద్ద 2002లో అప్పట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చొరవతో సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు మంజూరైంది. మొత్త నిధులు రూ.698 లక్షలు. అయిదు మండలాల్లో 66 ఆవాస ప్రాంతాలకు శుద్ధిచేసి నీళ్లు సరఫరా చేయాలని సంకల్పించారు. ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాల్లో ట్యాంకులు, పైపులైన్లను ఏర్పాటు చేశారు. నీళ్లొచ్చేస్తున్నాయని ప్రజలు ఆశించిన విధంగా సరఫరా జరగటంలేదు. ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లోని కొన్ని గ్రామాలకే పథకం పరిమితం చేశారు. ప్రస్తుతం గండిపాళెం జలాశయంలో డెడ్‌ స్టోరేజీ కారణంగా ప్రాజెక్టు పనితీరు మరింత తగ్గి నీటి సరఫరాను కేవలం ఉదయగిరి మండలానికి మాత్రమే పరిమితం చేశారు. సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు అందుబాటులో ఉన్నప్పటికీ రక్షిత నీరు సరఫరా లేక ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. సబ్‌ మిషన్‌ ప్రాజెక్టులో సాండ్‌స్లో ఫిల్టర్ల ఇసుకను మార్చేందుకు, మోటార్లు, పైపులైన్‌ మరమ్మతులకు సంబంధించి రూ.18 లక్షలతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. ప్రాజెక్టులో నీరు డెడ్‌ స్టోరేజీలో ఉన్న కారణంగా కొన్ని గ్రామాలకు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. గుత్తేదారులకు తాను వచ్చిన తరువాత ఎలాంటి బిల్లులు మంజూరు చేయలేదు. సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేస్తున్న నీటికి ప్రభుత్వం నిర్దేశించిన లెక్కల ప్రకారం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్లకు అధికారులు నిధులు మంజూరు చేస్తున్నారు. గ్రామాలకు శుద్ధి లేకుండానే సరఫరా చేస్తున్నారు. సాండ్‌స్లో ఫిల్టర్లు సరిగా పనిచేయక నీటి శుద్ధి జరగటంలేదు. రూ. లక్షలు ఖర్చుచేసి అందుబాటులోకి తెచ్చిన మైక్రో ఫిల్టర్‌ ఎందుకు పనిరాకుండా చాలా కాలం నిరుపయోగంగా ఉంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు హారతికర్పూరంలా కరిగిపోతున్నా ప్రజలకు మాత్రం మంచినీళ్లు అందటంలేదు. గ్రామాల్లో ఏర్పాటుచేసిన ట్యాంకులు అలంకారప్రాయంగా మారాయి. ఉన్నతాధికారులు స్పందించి ప్రాజెక్టు ఉద్దేశం నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు.

Related Posts