YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

హత్యాచార నిందితులకు స్పెషల్ బ్యారెక్స్

హత్యాచార నిందితులకు స్పెషల్ బ్యారెక్స్

హత్యాచార నిందితులకు స్పెషల్ బ్యారెక్స్
హైద్రాబాద్, డిసెంబర్ 2:
సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశా హత్యకేసు నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. నలుగుర్ని వేరు, వేరు (సింగిల్ సెల్స్‌లో) ఉంచారు జైలు అధికారులు. తోటి ఖైదీల నుంచి వీళ్లకు ప్రమాదం ఉంటుందని భావించి జాగ్రత్తలు తీసుకున్నారు. శనివారం ఈ నలుగురిపై తోటి ఖైదీలు ఆగ్రహం వ్యక్తం చేశారట.. అందుకే వారికి వేరు, వేరుగా సెల్‌లు కేటాయించారు. మిగిలిన ఖైదీలతో కలవకుండా ముందుగానే అప్రమత్తమయ్యారు. ఈ నలుగురిపై నిఘా కోసం మూడు షిఫ్టుల్లో సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది.పరిటాల రవి హత్య కేసులో నిందితుడుగా ఉన్న మొద్దు శీనును చంపిన ఓంప్రకాష్‌ను ఉంచిన బ్యారక్‌లోనే ఇప్పుడు ఈ నలుగురి కి జైలు సిబ్బంది కేటాయించినట్లు తెలుస్తోంది. జైలు అధికారులు కూడా కాస్త ప్రమాదకరంగా భావించే ఖైదీలను మాత్రమే ఇలా ప్రత్యేకంగా సింగిల్‌ సెల్స్‌‌లో ఉంచుతారట. ఈ సెల్స్‌కు ముందు వైపు తలుపునకు కటకటాలు.. వెనక వైపు 13 అడుగుల ఎత్తులో ఓ వెంటిలేటర్‌ ఉంటుందట. ఓ మూలన బాత్రూమ్‌ ఉంటుంది.ఇక ఈ నలుగురు రాత్రంతా నిద్ర పోకుండా గడిపినట్లు సమాచారం. తాము చేసిన తప్పు గురించి ఎలాంటి పశ్చాత్తాపం, ఆందోళన కూడా వారిలో కనిపించలేదట. తోటి ఖైదీలను కలిసే అవకాశాల్లేకుండా జైలు అధికారులు చర్యలు తీసుకున్నారట. ఆదివారం నలుగురికి ఉదయం టిఫిన్‌గా పులిహోర పెట్టారు.. మధ్యాహ్నం భోజనం (జైలు నిబంధనల ప్రకారం 250 గ్రాములు).. రాత్రి భోజనంలో మటన్ (జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు ఆదివారం మటన్ పెడతారు) పెట్టారు. రెండుసార్లు టీ కూడా తాగినట్లు తెలుస్తోంది.ఈ నలుగురు నిందితులకు సూసైడల్‌ ఇంటెన్షన్‌ (ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం) ఉందేమో గుర్తించేందుకు సోమ, మంగళవారాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. నలుగురిలో చెన్నకేశవులు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతడికి డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉండటంతో.. డాక్టర్లను సంప్రదించి వైద్యం అందజేయనున్నట్లు సమాచారం.మరోవైపు ఆదివారం నలుగురు నిందితుల్ని ఉంచిన చర్లపల్లి జైలు దగ్గర ఆందోనళలు కొనసాగాయి. మహిళా, ప్రజా సంఘాలు నిరసనకు దిగాయి.. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ ధర్నా చేశాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రాత్రి క్యాండిల్ ర్యాలీలు, నల్ల రిబ్బన్లతో నిరసనలు జరిగాయి. ఇటు సోమవారం కూడా విద్యార్థులు, మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.

Related Posts