YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వైఎస్సార్‌సీపీ నాయకుల నుంచి భద్రత కల్పించాలి నగరపాలక సంస్థ కమిషనర్‌కు విన్నవించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి రాజమహేంద్రవరం

వైఎస్సార్‌సీపీ నాయకుల నుంచి భద్రత కల్పించాలి నగరపాలక సంస్థ కమిషనర్‌కు విన్నవించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి రాజమహేంద్రవరం

వైఎస్సార్‌సీపీ నాయకుల నుంచి భద్రత కల్పించాలి
నగరపాలక సంస్థ కమిషనర్‌కు విన్నవించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం డిసెంబర్2   
మానసికంగా ఆర్పీలు, డివిజన్‌ వాలంటీర్లను వేధిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల నుంచి వారికి భద్రత కల్పించాలని కోరుతూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ విన్నవించారు. ఈ మేరకు సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), నగర టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు, బీసీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పాలిక శ్రీను, రెడ్డి రాజు ఇతర నాయకులతో హాజరై విన్నతి పత్రం అందచేశారు.  ఈ సంధర్భంగా ఎమ్మెల్యే భవానీ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు, నాయకురాండ్లు ఆర్పీలు, డివిజన్‌ వాలంటీర్లు, మహిళా సంఘాల సభ్యులను తీవ్రంగా వేధిస్తున్నారని, నిత్యం సమాచారం ఇవ్వాలని వారిని తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. అయితే వారి నుంచి ఏదైనా సమాచారం తీసుకోవాలన్నా... లేదా తెలుసుకోవాలన్నా ఆ అధికారం అధికారులకు అలాగే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ఉంటుంది స్పష్టం చేశారు. అయితే అందుకు విరుద్ధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు  తమకు సమాచారం ఇవ్వాలంటూ నిత్యం వారిని వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. వైఎస్సార్‌సీపీకి పార్టీకి చెందిన నాయకురాండ్లు ఆర్పీలతో మీటింగ్‌లు నిర్వహించి ప్రతి సమాచారాన్ని తమకు, అలాగే పార్టీకి చెందిన నాయకులకు తెలియచేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వారు ఆయోమయానికి గురవుతున్నారని వివరించారు. ఈ విధానం సరైనది కాదని, ఆర్పీలకు కానీ, డివిజన్‌ వాలంటీర్లకు కానీ ఏమైనా ఆదేశాలు జారీ చేయాలన్నా, సమావేశాలు నిర్వహించాలన్నా కమిషనర్‌కు, నగరపాలక సంస్థ అధికారులకు అలాగే ప్రజా ప్రతినిధులుగా తమకు అధికారం ఉందన్నారు. అంతే తప్పితే ఎవరు పడితే వారు ఆదేశాలు జారీ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. ఆర్పీలు, డివిజన్‌ వాలంటీర్లపై వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్న పెత్తనం అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పెనుగొండ విజయభారతి, తలారి ఉమా, రెడ్డి పార్వతి, పాలవలస వీరభద్రం, మర్రి దుర్గాశ్రీనివాస్‌, తంగెల బాబి, నాయకులు కంటిపూడి శ్రీనివాస్‌, పెనుగొండ రామకృష్ణ, నల్లం ఆనంద్‌, తలారి భవగవాన్‌, కొమ్మా రమేష్‌, పితాని కుటుంబరావు, సాయి, జాలా మధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Posts