YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

వంద శాతం టీకాలు వేయాలి:  జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

వంద శాతం టీకాలు వేయాలి:  జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

వంద శాతం టీకాలు వేయాలి: 
జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి
ములుగు, డిసెంబర్ 2
 వంద శాతం  0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో మిషన్ ఇంద్రధనుస్సు అమలుపై కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం ద్వారా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 2 లక్షల 96 వేల 183 మంది జనాభా ఉన్నట్లు, ఇందులో 3 వేల 556 మంది గర్భిణులు, 24 వేల 189 మంది 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంటింటికి ప్రత్యేక సర్వే చేపట్టి, 25 మంది గర్భిణులు, 196 మంది 0 నుండి 2 సంవత్సరాల లోపు, 115 మంది 2 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు టీకాలు తీసుకోనట్లు గుర్తించామన్నారు. ఈ కార్యక్రమం క్రింద ఈ నెల 2, 3, 5, 6, 9, 10, 12 తేదీల్లో 179 వ్యాధి నిరోధక టీకాల ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకునేలా చర్యలు చేపడతామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలుంటారని, కావున కేంద్రం లోని ప్రతి పిల్లవాడు టీకాలు వేసుకునేలా చూడాలన్నారు. కార్యాచరణ ను ప్రతి గ్రామంలో ముందస్తుగా టామ్ టామ్ ద్వారా విస్తృత ప్రచారం గావించాలన్నారు. ఏఎన్ఎంలు తల్లిదండ్రులకు ఏ టీకా ఇస్తుంది, దాంతో ఏ వ్యాధి నివారించబడుతుంది, చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు (సైడ్ ఎఫెక్ట్స్) ఏమేం ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, తర్వాత టీకా ఎప్పుడు వేయించాలి తదితర వివరాలు పూర్తిగా అర్థం అయ్యేట్లు చెప్పాలన్నారు.   టీకా కార్డు ఇచ్చి, కార్డు భద్రంగా  ఉంచి, తదుపరి సందర్శనకు తప్పక తీసుకురావాలని తెలియజేయాలి. టీకాలు తప్పిపోయిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. కార్యాచరణ ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లతో పాటు, అన్ని ప్రయివేటు స్కూళ్లలోను చేపట్టాలన్నారు. వ్యాధి నివారణ కంటే, వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని కలెక్టర్ అన్నారు. ప్రజల్లో పూర్తి అవగాహనా తోపాటు, చైతన్యం కలిగేలా అన్ని చర్యలు తీసుకోని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.
     ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారిణి రమా దేవి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. అప్పయ్య, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. శ్యామ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారిణి మల్లీశ్వరి, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Posts