అత్యాచార ఆలోచనలు వచ్చే వారికి గుర్తుండిపోయేలా దోషులను శిక్షించాలి
హైదరాబాద్ డిసెంబర్ 2
కామాందుల చేతుల్లో అత్యాచారానికి గురైన కిరాతకంగా హత్య చేయబడిన ప్రియాంక రెడ్డి మృతి పట్ల ఆల్ ఇండియాఓబిసి ఓబిసి ఫెడరేషన్ జాతీయ ప్రదాన కార్యదర్శి ఎన్.నిర్మలా ముదిరాజ్ ఒక ప్రకటనలో తన విచారం వ్యక్తం చేశారు. ప్రియాంక రెడ్డి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మనల్ని కంటికి రెప్పలా కాపాడే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారిని అతి కిరాతకంగా హత్య చేస్తున్న వారి పట్ల చట్టాలను కఠిన తరం చేసి... దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మహిళలను వేధించిన సంఘటనలు చాలానే జరిగాయని, ఇటువంటి సంఘటనలు చేసిన సమయంలో అప్పటి ప్రభుత్వాలు స్పందించి చట్టాలు చేస్తున్నారే తప్పితే... వాటిని కఠినంగా అమలు చేయకపోవడం వల్లే అటువంటి సంఘటనలు పునరావృత్తం అవుతున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్భయ, విజయవాడలో శ్రీలక్ష్మి, అయేషా, రాజమహేంద్రవరంలో అనూష, ప్రస్తుతం తెలంగాణాలో ప్రియాంక రెడ్డి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయంటే చట్టాల్లో లోపమా... లేక ప్రభుత్వాల్లో లోపమా అనేది ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. మహిళలను వేధించే వారి కోసం కొత్త చట్టాలను చేయకుండా... ఉన్న చట్టాలను కఠినతరం చేసి సక్రమంగా అమలు చేస్తే నిర్భయ నుండి..ప్రియాంక రెడ్డి వంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి... అతి క్రూరంగా హత్య చేసిన వారిని ఊరికే వదిలేయకుండా... భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు... అలాగే ఆ ఆలోచనలు వచ్చే వారికి గుర్తుండిపోయేలా దోషులను శిక్షించాలని డిమాండ్ నిర్మల చేశారు.