YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చిన్న, మధ్యతరహ బేదం లేకుండా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి..  డిఆర్ఓ కు టీ డబ్ల్యూ జే ఎఫ్ నాయకుల వినతి

చిన్న, మధ్యతరహ బేదం లేకుండా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి..  డిఆర్ఓ కు టీ డబ్ల్యూ జే ఎఫ్ నాయకుల వినతి

చిన్న, మధ్యతరహ బేదం లేకుండా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.. 
డిఆర్ఓ కు టీ డబ్ల్యూ జే ఎఫ్ నాయకుల వినతి
వనపర్తి డిసెంబర్ 2 
పత్రికల్లో చిన్న, మధ్యతరహా భేదాలు చూడకుండా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తూ 239 జీవోను సవరణ చేయాలంటూ వనపర్తి జిల్లా టి డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో డి టి ఓ వెంకటయ్య కు వినతి పత్రాన్ని పత్రాన్ని సమర్పించారు . సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో నాయకులు పాల్గొని వారి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని  డి టి వో కు అందజేస్తూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై  వివరించారు .ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు వి. అశోక్ కుమార్, అధ్యక్షులు బి. జ్ఞానేశ్వర్,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి జాంగిర్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ జిల్లాలో అక్రిడేషన్ కార్డులు జారీ  ప్రక్రియ సరిగా లేదని వారన్నారు. కొన్ని జిల్లాల్లో మీడియా అక్రిడేషన్ కమిటీలు రూపొందించి జాబితా ప్రకారం ఇవ్వకుండా జాప్యం జరుగుతుందని వారన్నారు. పత్రికల్లో బేధాభిప్రాయాలు వల్ల జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, 239 జీవోను సవరించాలని, చిన్న మధ్యతరహా పత్రికల కు మున్సిపాలిటీ వారిగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, మహబూబ్ నగర్ జిల్లా తో పాటు ఇతర జిల్లాల్లో నెలకొన్న అక్రిడేషన్ కార్డుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, మహబూబ్ నగర్ జిల్లా అక్రిడేషన్ సభ్యుడు బండి విజయ్ కుమార్ అక్రిడేషన్ కార్డును ఆ కారణంగా రద్దు చేశారని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి పునరుద్ధరించాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిఆర్ఓ వెంకటయ్య వారు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు పాన్గల్ రిపోర్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts