YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై తనఖీ.. 

నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై తనఖీ.. 

నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై తనఖీ.. 
వనపర్తి డిసెంబర్ 2 
నెంబర్ ప్లేట్లు లేకుండా నకిలీ నెంబర్ ప్లేట్లు తో వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పవని సీఐ సూర్య నాయక్ వాహనదారులకు హెచ్చరించారు.  సోమవారం రోజు జిల్లా కేంద్రంలో  వనపర్తి సిఐ సూర్యనాయక్, వనపర్తి పట్టణ ఎస్సై,వెంకటేష్ గౌడు  అద్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్టేషన్ పరిధిలో  రాజీవ్ చౌరస్తా, వివేకానంద చౌరస్తా, వివిధ రహదారులపై సోమవారం ఉదయం  9 గంటల నుండి 12 గంటల వరకు నెంబరు ప్లేట్లు లేని వాహనాల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు,  ఈ సందర్భంగా  వనపర్తి పట్టణ పోలీస్టేషన్  పరిధిలోని ముఖ్యకూడల్లో మొత్తం 78 వాహనాల గుర్తించి వాహనాలను వనపర్తి పట్టణ పోలీస్టేషన్ కు  తరలించి జరిమానాలు విధించి పెండింగ్ ఈ-చాలాన జరిమానాలు కట్టించి వాహనాలకు నెంబరు ప్లేట్ బిగించి వహదారులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వాహన దారులు  ట్రాఫిక్ నియమాలను పాటించకుండా వాహనాలు నడుపుతూ పోలీసులు విధిస్తున్న ఈ- చాలానాల బారి నుండి తప్పించుకునేందు తమ  వాహనాలకు సంబందించిన నెంబర్ ప్లాట్ కు బదులు వేరే నెంబర్ ప్లేట్లను అమర్చి వాడినట్లైతే  అలాంటివారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేస్తామని ఎస్సై  హెచ్చరించారు. ఈ సందర్భంగా  వనపర్తి సిఐ,  మాట్లాడుతూ వనపర్తి పట్టణంలో  తరచుగా నెంబరు ప్లేట్ లేని వాహనాల చోదకులు వేగంగా నడుపుతూ తోటివహదారులకు,ప్రజలకు,పాదాచారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నందున నంబరు ప్లేట్లులేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు.

Related Posts