అణ్వాయుధ వ్యాప్తి నిరోధంలో భారతదేశం స్థాయిని పెంచే పరిణామం జరిగింది. ఆస్ట్రేలియా గ్రూప్‌లో భారతదేశానికి సభ్యత్వం లభించింది. దీంతో అత్యంత కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందే అవకాశం ఏర్పడింది. అణ్వాయుధ వ్యాప్తి నిరోధానికి సంబంధించి నాలుగు వ్యవస్థలు ఉన్నాయి. వీటిలో మూడింటిలో మన దేశం సభ్యత్వం సాధించినట్లయింది. గతంలో మన దేశం మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ (ఎంటీసీఆర్)తోపాటు వసినార్ ఎరేంజ్‌మెంట్‌లో సభ్యత్వం సాధించిన సంగతి తెలిసిందే. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయకపోయినప్పటికీ మన దేశం ఈ వ్యవస్థల్లో సభ్యత్వం సంపాదించడం చెప్పుకోదగిన విషయం. ఇక అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్‌జీ)లో సభ్యత్వం సాధించడం మాత్రమే మిగిలింది. ఈ విషయంలో చైనా పెద్ద అడ్డుగోడగా మారడంతో సంక్లిష్టత పెరిగింది. వసినార్ ఎరేంజ్‌మెంట్‌లో కానీ, ఎంటీసీఆర్‌లో కానీ చైనా సభ్య దేశం కాదు.